Representative Image (Image Credit To Original Source)
TGSRTC: టూర్‌కి వెళ్లాలనుకుంటున్నారా? మీలాంటి వారి కోసమే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ స్పెషల్ టూర్ ప్యాకేజ్‌లు ప్రకటించింది. అలాగే, స్పెషల్ బస్సులను నడుపుతోంది. ఈ నెల 23న కోల్హాపూర్ యాత్ర, వచ్చేనెల 6న గోవా యాత్రలు వెళ్లొచ్చు.
అంతేకాదు, హైదాబాద్ బీహెచ్‌ఈఎల్ డిపో నుంచి సెలవు దినాల్లో సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులను నడుపుతోంది. వీటి ద్వారా కాళేశ్వరం, మేడారంతో పాటు శ్రీశైలం, అరుణాచలం, కంచి వంటి ప్రాంతాలకు వెళ్లొచ్చు.
Also Read: “బిచ్చగాడు” సినిమా స్టోరీ కాదు.. ఈ యాచకుడు నిజంగానే కోటీశ్వరుడు.. అయినా రోడ్లపై అడుక్కుంటున్నాడు?
ఈ నెల 23న బీహెచ్‌ఈఎల్ డిపో నుంచి గానుగాపూర్, కోల్హాపూర్, తుల్జాపూర్ ప్రాంతాలకు బస్సు బయలుదేరనుంది. రూ.3 వేలకే ఈ స్పెషల్ ప్యాకేజీ పొందవచ్చు. మరోవైపు, మేడారం జాతరకు గ్రేటర్‌జోన్‌లోని పలు డిపోల నుంచి స్పెషల్ బస్సులను నడపనున్నారు.
వచ్చేనెల 6న గోవా యాత్ర పేరుతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక సర్వీసు ఉంటుంది. ఒక్కో టికెట్ రూ.3,500తో హంపి, గోవా, తుల్జాపూర్ వెళ్లిరావచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి 9391072283, 9063401072 నంబర్లకు ఫోన్ చేయొచ్చు.