Rtc Driver Shankar Goud: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కు అశ్రునివాళి.. ముత్తోజీపేటలో అంత్యక్రియలు
గంటకు పైగా నడిరోడ్డుపైనే శంకర్ గౌడ్ మృతదేహం ఉండగా.. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చివరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ జేఏసీ నేతలు చొరవ తీసుకోవాలని కోరారు.
Rtc Driver Shankar Goud Last Rites: వరంగల్ ముత్తోజిపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య అంతిమయాత్ర జరిగింది. అంతిమ యాత్రలో కుటుంబసభ్యులు, ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అశ్రునయనాల నడుమ శంకర్ గౌడ్‌కు వీడ్కోలు పలికారు.
అంతకుముందు శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా విశ్వప్రయత్నాలు చేశారు. తన వాహనంలో శంకర్ ఫ్యామిలీని డిపోకు తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ, బండి సంజయ్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే అంత్యక్రియలు నిర్వహించుకోవాలంటూ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ సహా కార్మికులకు నచ్చజెప్పేందుకు సీపీ ప్రయత్నించినా పట్టువీడలేదు. అయితే, నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోము అని తేల్చి చెప్పారు పోలీసులు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని వెనక్కి తీసుకెళ్లారు.
చివరకు ముత్తోజిపేటలోని ఆయన కూతురు ఇంటికి తరలించారు. గంటకు పైగా నడిరోడ్డుపైనే శంకర్ గౌడ్ మృతదేహం ఉండగా.. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చివరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ జేఏసీ నేతలు చొరవ తీసుకోవాలని కోరారు. దీంతో శంకర్ గౌడ్ కుటుంబసభ్యులతో మాట్లాడారు జేఏసీ నేతలు. చివరకు ముత్తోజీపేటలో అంత్యక్రియలు నిర్వహించేందుకు శంకర్ గౌడ్ కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. దాంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆందోళన విరమించారు. ముత్తోజీపేట నుంచి బండి సంజయ్, బీజేపీ శ్రేణులు వెళ్లిపోయారు.
కాగా ఆర్టీసీ కార్మికుల సమ్మె, కార్మికుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న మనస్తాపంతో డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్ ఎదుట ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
Also Read: కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో ఊరట.. ఆ కేసులు కొట్టివేత
