Thatikonda Rajaiah
Thatikonda Rajaiah : ఇటీవల వివాదాలు..లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజయ్య మాట్లాడుతు..మరోసారి స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ నాదేనని గెలుపు కూడా నాదే అంటూ ధీమా వ్యక్తంచేశారు. సోషల్ మీడియాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని అందరు ధైర్యంగా ఉండాలని తన క్యాడర్ కు భరోసా ఇచ్చారు రాజయ్య. బీఆర్ఎస్ తరపున టికెట్ తనదేని గెలుపు కూడా తనదేనని స్పష్టం చేసిన రాజయ్య..కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు. స్టేషన్ ఘన్ పూర్ లోనే పోటీచేస్తా..గెలిచి నాపై పుకార్లు పుట్టినవారికి నిరూపిస్తా అంటూ సవాల్ చేశారు. ఇవన్నీ మాజీ మంత్రి కడియం శ్రీహరిని ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలేనని అంటున్నారు స్థానికులు.
Ponguleti Srinivas Reddy: బీజేపీలోకి ఖాయమా? పొంగులేటి ఇంటికి బీజేపీ చేరికల కమిటీ.. పసందైన విందు ..
కేసీఆర్‌కు వీర విధేయుడిగా ఉన్నానన్న రాజయ్య ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ఆశీర్వాదంతో బంపర్ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ లో పార్టీ బలపడింది అంటూ అది కేసీఆర్ గొప్పతనమేనన్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన అభివృద్దితోనే ప్రజలు అందరు మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. పార్టీ చేపట్టే కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ప్రభుత్వం చేసే అభివృద్ధే మరోసారి గెలుపుకు బాటలు వేస్తుందని అన్నారు తాటికొండ రాజయ్య.
కాగా ఇటీవల ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని నీకు డబ్బు కావాలన్నా..బంగారం కావాలన్నీ ఏది కావాలన్నా ఇస్తాను నా కోరిక తీర్చు అంటూ వేధిస్తున్నారని జానకీపురం మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సంచలన ఆరోపణలపై ఎమ్మెల్యే రాజయ్య స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కొంతమంది నాపై కుట్ర పన్ని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని నేను ఎవ్వరికి ఫోన్లు చేయలేదు..ఎటువంటి వేధింపులకు పాల్పడలేదని రాజయ్య తెలిపారు.