Khammam Pablic meeting
BRS Khammam Meeting: ఖమ్మంలో రేపు నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు మూడు రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రికి వారు హైదరాబాద్ చేరుకోనున్నారు. కేరళ సీఎం పినరాయి విజయన్ తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకుంటారు. వీరు బుధవారం ఉదయం 11గంటలకు సీఎం కేసీఆర్‌తో కలిసి యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకొని ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొంటారు.
కేరళ సీఎం పినరాయి విజయన్ మంగళవారం రాత్రి 9గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి ఇక్కడే బస చేసి బుధవారం ఉదయం 11గంటలకు ప్రగతిభవన్ నుంచి హెలికాప్టర్ ద్వారా యాదగిరి గుట్టకు వెళ్తారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకొని ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4గంటలకు విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకొని కేరళ తిరిగి వెళ్తారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌సైతం ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. బుధవారం ఉదయం 11 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5గంటలకు విజయవాడ చేరుకొని అక్కడ నుంచి ఢిల్లీ వెళ్తారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా నేడు రాత్రి హైదరాబాద్ చేరుకొని రేపు ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొంటారు.
Khammam Politics : అసలేం జరుగుతోంది? పోటాపోటీ సభలు.. కాక రేపుతున్న ఖమ్మం పాలిటిక్స్
యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌సైతం రేపు ఖమ్మంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే భహిరంగసభలో పాల్గోనున్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రి 8గంటలకు లక్నోలో బయలుదేరి రాత్రి 10గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బసచేస్తారు. బుధవారం ఉదయం యాదగిరి గుట్టకు వెళ్తారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకొని పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఖమ్మంలో జరిగే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. రేపు సాయంత్రం లక్నోకు తిరుగు పయణమవుతారు. మూడు రాష్ట్రాల సీఎంలతో పాటు పలు పార్టీల ప్రముఖులు నేడు రాష్ట్రానికి చేరుకొని, రేపు పలు ప్రాంతాల్లో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.