Khammam Politics : అసలేం జరుగుతోంది? పోటాపోటీ సభలు.. కాక రేపుతున్న ఖమ్మం పాలిటిక్స్‌

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం మరింత హీట్ ఎక్కింది. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటాపోటీ సభలతో ఖమ్మం పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. తుమ్మల, పొంగులేటి మీటింగ్స్ పై టీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ చేసింది. ఇద్దరు నేతలపైనా నిఘా పెట్టినట్లు సమాచారం.

Khammam Politics : అసలేం జరుగుతోంది? పోటాపోటీ సభలు.. కాక రేపుతున్న ఖమ్మం పాలిటిక్స్‌

Updated On : January 1, 2023 / 8:12 PM IST

Khammam Politics : ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం మరింత హీట్ ఎక్కింది. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటాపోటీ సభలతో ఖమ్మం పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. తుమ్మల, పొంగులేటి మీటింగ్స్ పై టీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ చేసింది. ఇద్దరు నేతలపైనా నిఘా పెట్టినట్లు సమాచారం.

Also Read..TRS To BRS : ‘అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో బీఆర్ఎస్ .. ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండాయే : సీఎం కేసీఆర్

పార్టీలో అసలేం జరుగుతోంది? మీటింగ్ కు ఎవరెవరు వచ్చారు? అని ఖమ్మం జిల్లా నేతలను హైకమాండ్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు అటు తుమ్మల, ఇటు పొంగులేటి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Also Read..Thota Chandrasekhar : కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి జనసేన కీలక నేత, బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు

40 ఏళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పని చేశానన్న తుమ్మల.. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు. గోదావరి జలాలతో పాలేరు ప్రజల పాదాలు కడిగి రుణం తీర్చుకుంటానని అన్నారు. ఇటు రాబోయే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేస్తారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాంబు పేల్చారు. బీఆర్ఎస్ లో తనకు దక్కిన గౌరవం ఏంటో మీ అందరికీ తెలుసు అని కామెంట్ చేశారు.