Police Jobs : తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాల దరఖాస్తులకు నేడే ఆఖరు

మరోవైపు అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు యూనిఫాం సర్వీసెస్‌ ఉద్యోగాలకు ప్రభుత్వం మరో రెండేండ్లు వయోపరిమితి పెంచింది. అన్ని విభాగాల్లో కలిపి 17వేల 516 పోస్టులకుగాను ఇప్పటివరకు 11 లక్షల 80వేల దరఖాస్తులు వచ్చినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి.

police job applications : తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాల దరఖాస్తులకు ఇవాళ్టితో గడువు ముగియనుంది. ఎక్సైజ్‌, జైళ్లు, అగ్నిమాపక శాఖల్లోని పోస్టులకు రాత్రి 10 గంటలతో దరఖాస్తుల గడువు ముగియబోతోంది. ఈ నెల 20న రాత్రి 10 గంటల వరకు తుది గడువు ముగిసినా.. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి దానిని ఇవాళ్టి వరకు పొడిగించింది. 20వ తేదీనే అప్లికేషన్లకు ఆఖరి తేదీ అని చెప్పడంతో.. చాలా మంది అభ్యర్థులు ఒకేసారి దరఖాస్తుకు చేసుకోవడానికి ప్రయత్నించడంతో సర్వర్ డౌన్ అయింది.

వెబ్ సైట్ ఓపెన్ కాలేదు. దీంతో ప్రభుత్వం ఆఖరి నిమిషంలో దరఖాస్తు గడువును పొడిగించింది. మరోవైపు అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు యూనిఫాం సర్వీసెస్‌ ఉద్యోగాలకు ప్రభుత్వం మరో రెండేండ్లు వయోపరిమితి పెంచింది. అన్ని విభాగాల్లో కలిపి 17వేల 516 పోస్టులకుగాను ఇప్పటివరకు 11 లక్షల 80వేల దరఖాస్తులు వచ్చినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి.

Telangana Govt jobs : తెలంగాణలో కొలువుల జాతర..కోచింగ్‌ సెంటర్ల బాటపట్టిన నిరుద్యోగులు

అయితే, వయోపరిమితిని పొడిగించడం, దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళ్టి వరకు అవకాశం కల్పించడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అంచనా వేస్తోంది. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తుల సంఖ్యకు సంబంధించిన ఖచ్చితమైన లెక్కలను బోర్డు వెల్లడించనుంది.

ట్రెండింగ్ వార్తలు