Drinker
Drinker: తాగుడు అలవాటు కొందరిని ఎంతటి నీచమైన పనిచేయడానికైనా దిగజార్చుతుంది. చాలామంది తాగేందుకు ఇంట్లో వస్తువులను అమ్ముకుంటారు. ఇంకొందరు దొంగతనాలు చేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం కన్నకూతురినే అమ్ముకున్నాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్‌కు చెందిన పండ్ల వ్యాపారి రహీం మద్యానికి బానిస అయ్యాడు. పండ్ల వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బులను మద్యం తాగేందుకు ఉపయోగించేవాడు.
ఆలా కొద్దీ రోజులకు అతడు వ్యాపారం చేయడానికి డబ్బు లేకుండా పోయింది. వచ్చిన డబ్బు మొత్తం తాగుడుకి పెట్టడంతో వ్యాపారానికి కావలసిన పండ్లు కొనలేకపోయాడు. దీంతో వ్యాపారం నిలిచిపోయింది. తాగుడుకు డబ్బులు లేవు. ఈ సమయంలోనే అతడికి హైదరాబాద్ కు చెందిన హాఫిజ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడికి పిల్లలు లేరనే విషయం తెలుసుకున్నాడు. రూ15 వేలు ఇస్తే తన కూతురిని ఇస్తానని తెలిపాడు.
దీనికి హాఫిజ్ ఒకే చెప్పడంతో 18 నెలల కూతురిని హాఫిజ్ చేతిలో పెట్టి రూ.15 వేలు తీసుకోని ఇంటికి వెళ్ళాడు.. కూతురు కనిపించడం లేదని భార్య రహీంని అడిగింది. రహీం తనకు తెలియదని సమాధానం ఇవ్వడంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేసింది. తమదైన శైలిలో విచారించిన పోలీసులు రహీం కూతురుని అమ్మేశాడని గుర్తించారు. వెంటనే రహీం, హాఫిజ్ లను అరెస్ట్ చేసి పాపను ఆమె తల్లికి అప్పగించారు.