Oxygen Train : ప్రాణవాయువును తెచ్చేందుకు ఒడిషాకు బయల్దేరిన తొలి ఆక్సిజన్‌ రైలు

ఆక్సిజన్‌ తరలింపునకు తెలంగాణ ప్రభుత్వం రైల్వేశాఖ సాయం తీసుకుంటోంది. ఒడిషాలోని అంగూల్ నుంచి ప్రాణవాయువును తెచ్చేందుకు ఐదు ట్యాంకర్లతో కూడిన తొలి ఆక్సిజన్‌ రైలు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరింది.

first oxygen train : ఆక్సిజన్‌ తరలింపునకు తెలంగాణ ప్రభుత్వం రైల్వేశాఖ సాయం తీసుకుంటోంది. ఒడిషాలోని అంగూల్ నుంచి ప్రాణవాయువును తెచ్చేందుకు ఐదు ట్యాంకర్లతో కూడిన తొలి ఆక్సిజన్‌ రైలు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరింది. వీలైనంత వేగంగా, సాధ్యమైనంత త్వరగా ఈ రైలు అంగూల్‌ నుంచి సికింద్రాబాద్‌ వచ్చేలా గ్రీన్‌ కారిడార్‌ మ్యాప్‌ను రైల్వే అధికారులు సిద్ధం చేశారు. ఇకపై ఆక్సిజన్‌ సరఫరా కోసం ఏమైనా అభ్యర్థనలు వస్తే వాటిని స్వీకరిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్ మాల్యా తెలిపారు.

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా బాధితుల్లో చాలా మంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో కోవిడ్ పేషెంట్స్ కు ఆక్సిజన్ అత్యవసరమైంది. రాష్ట్రంలో తగిన స్థాయిలో ఆక్సిజన్ నిల్వలు లేవు.

కాబట్టి ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్న రాష్ట్రాల నుంచి ప్రాణవాయువును తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఒడిషాలోని అంగూల్ నుంచి ప్రాణవాయువును తెచ్చేందుకు తొలి ఆక్సిజన్‌ రైలు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరింది.

ట్రెండింగ్ వార్తలు