జనగాం జిల్లాలో దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

danger missed to Danapur Express : జనగాం జిల్లాలో దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌ వెళ్తున్న దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్, బోగీలకు మధ్య ఉన్న కప్లింగ్ ఊడిపోయింది. స్టేషన్ ఘనపూర్ దగ్గర ఎక్స్‌ప్రెస్‌ రెండు కిలోమీటర్లు దూరం వెళ్లి ఆగిపోయింది.

రైలు బోగీలు కొంత దూరం వెళ్లి నిలిచిపోయాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు… దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు మరమ్మత్తులు చేపట్టారు.