Telangana Secretariat: తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

ఏప్రిల్ 30న సచివాలయం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 30, ఆదివారం, మేఘ లగ్నం, ఉదయం 06.08 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సచివాలయం ప్రారంభోత్సవం జరగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 01.20కి సీఎం కేసీఆర్ సీట్లో కూర్చుంటారు.

Telangana Secretariat: తెలంగాణలో నూతనంగా నిర్మించిన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 30న సచివాలయం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 30, ఆదివారం, మేఘ లగ్నం, ఉదయం 06.08 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సచివాలయం ప్రారంభోత్సవం జరగుతుంది.

Rains In Telangana: తెలంగాణలో మోస్తరు వర్షాలు.. మూడు రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే..

అదే రోజు మధ్యాహ్నం 01.20కి సీఎం కేసీఆర్ సీట్లో కూర్చుంటారు. ఆ తర్వాత మంత్రులు, అధికారులు తమకు కేటాయించిన ఛాంబర్లలోని, సీట్లలో కూర్చుంటారు. ఇప్పటికే నూతన సచివాలయానికి సంబంధించిన 3డీ యానిమేషన్ వీడియో విడుదలైంది. సచివాలయ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. నూతనంగా నిర్మించిన ఈ సచివాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆధునికత, పచ్చదనం ఉట్టిపడేలా సచివాలయాన్ని తీర్చిదిద్దారు.

బిల్డింగ్ ఆరో అంతస్థులో సీఎం కేసీఆర్, ఆయన కార్యాలయం ఉంటుంది. సచివాలయానికి వచ్చే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, సమావేశాలు నిర్వహించుకునేలా సచివాలయం నిర్మాణమైంది.

ట్రెండింగ్ వార్తలు