Rains In Telangana: తెలంగాణలో మోస్తరు వర్షాలు.. మూడు రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే..

బుధవారం తెలంగాణలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. గురువారం కూడా అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెండో రోజులపాటు మెరుపులు, ఈదురుగాలుల (గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిమీ)తో కూడిన వర్షాలు పడతాయి. గురువారం వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది.

Rains In Telangana: తెలంగాణలో మోస్తరు వర్షాలు.. మూడు రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే..

Updated On : March 14, 2023 / 4:28 PM IST

Rains In Telangana: తెలంగాణలో మంగళవారం పొడి వాతావరణం ఉంటుందని, బుధ, గురు వారాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ కేంద్రం అధికారి నాగరత్న దీనికి సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. బుధవారం తెలంగాణలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.

YS Sharmila: కేసీఆర్ అవినీతి పాలనపై ఢిల్లీలో షర్మిల ర్యాలీ.. అరెస్ట్ చేసిన పోలీసులు

గురువారం కూడా అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెండో రోజులపాటు మెరుపులు, ఈదురుగాలుల (గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిమీ)తో కూడిన వర్షాలు పడతాయి. గురువారం వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది. బుధవారం నుంచి వాతావరణం చల్లబడుతుంది. చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన ద్రోణి కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడి.. వర్షం కురుస్తుంది. ఎక్కువగా ఉత్తర తెలంగాణతోపాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 19 వరకు తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని నాగరత్న తెలిపారు.