TET : టెట్‌ సర్టిఫికెట్‌ ఉద్యోగం వచ్చేవరకు చెల్లుబాటు

ప్రస్తుత నిబంధనల ప్రకారం టెట్‌ సర్టిఫికెట్‌ గడువు ఏడేళ్లుగా ఉంది. టీఎస్‌ టెట్‌ అర్హత ఎప్పటికీ వర్తించేలా సవరిస్తూ బుధవారం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

TET certificate : టెట్ సర్టిఫికెట్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌ టెట్‌)లో ఒక్కసారి అర్హత సాధిస్తే ఆ సర్టిఫికెట్‌ ఉద్యోగం వచ్చేవరకు చెల్లుబాటవుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

2011 ఫిబ్రవరి 11న విడుదల చేసిన టెట్‌ మార్గదర్శకాల అనంతరం టెట్‌ అర్హత సాధించినవారికి కూడా ఇది వర్తిస్తుందని వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం టెట్‌ సర్టిఫికెట్‌ గడువు ఏడేళ్లుగా ఉంది. టీఎస్‌ టెట్‌ అర్హత ఎప్పటికీ వర్తించేలా సవరిస్తూ బుధవారం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

TET Certificate Validity: గుడ్‌న్యూస్.. టెట్ సర్టిఫికెట్ వ్యాలిడిటీ జీవితకాలానికి పొడిగింపు

టెట్‌ నిబంధనలను సవరించినందున టెట్‌ నిర్వహణకు అనుమతిస్తూ ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు ఇచ్చారు. పాఠశాల విద్య సంచాలకుడు, టెట్‌ కమిటీ ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు