TET Certificate Validity: గుడ్‌న్యూస్.. టెట్ సర్టిఫికెట్ వ్యాలిడిటీ జీవితకాలానికి పొడిగింపు

టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. టెట్ పాసైన అభ్యర్థులకు వ్యాలిడిటీ పీరియడ్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్‌ను 7 ఏళ్ల నుంచి జీవితకాలం వరకు పొడిగించారు.

TET Certificate Validity: గుడ్‌న్యూస్.. టెట్ సర్టిఫికెట్ వ్యాలిడిటీ జీవితకాలానికి పొడిగింపు

Tet Certificate Validity

TET Test Certificate Validity : టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. టెట్ పాసైన అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) వ్యాలిడిటీ పీరియడ్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్‌ను 7 ఏళ్ల నుంచి జీవితకాలం వరకు పొడిగించినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి రమేశ్ తెలిపారు.

2011 నుంచి టెట్ పాసైన వారికి ఏడేళ్ల కాలపరిమితి ఉన్న సర్టిఫికేట్ గడువును జీవితకాలానికి పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి రమేష్ పేర్కొన్నారు. గతంలో టెట్ ఏడేళ్ల వ్యాలిడిటీ ముగిసిన వారికి కొత్తగా లైఫ్‌టైమ్ స‌ర్టిఫికెట్ ఇవ్వాల‌ని విద్యాశాఖ సూచించింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) ప్రకారం.. ఫిబ్రవరి 11, 2011 నుంచి టెట్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారికి ఏడేళ్ల నుంచి జీవితకాలనికి సర్టిఫికేట్ గడువును పొడిగిస్తున్నట్టు మంత్రి రమేశ్ వెల్లడించారు.

7 సంవత్సరాల వ్యవధి ఇప్పటికే ముగిసిన అభ్యర్థులకు కొత్త TET సర్టిఫికెట్లను తిరిగి ధృవీకరించడానికి లేదా ఇవ్వడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, యుటిలు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బోధనా రంగంలో వృత్తిని సాధించాలనుకునే అభ్యర్థులకు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని రమేష్ పోఖ్రియాల్ అన్నారు.


ఉపాధ్యాయులలో అర్హత పరీక్ష అనేది పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా నియామకానికి అర్హత సాధించడానికి అవసరమైన అర్హతలలో ఒకటి. 2011 నుంచి టెట్ స‌ర్టిఫికెట్ పొందిన అభ్యర్థుల‌కు జీవిత‌కాలం అర్హత వ‌ర్తించ‌నుందని మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు.