Rythu Bandhu funds
Rythu Bandhu Funds : తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయంగా రైతుబంధు నిధులను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త అందించింది. మరోసారి రైతుబంధు నిధులను విడుదల చేసింది. మరో రూ.550.14 కోట్ల రైతుబంధు నిధులు మంగళవారం విడుదల చేశారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
ఈ నిధులను 1.60 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. దీంతో ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రంలో 62.45 లక్షల మంది రైతులకు రూ.6351.22 కోట్లను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఖమ్మంలో ఇవాళ జరుగున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నవ శకానికి నాంది పలకనుందని చెప్పారు.
Telangana Rythu Bandhu : ఈసారి రూ.7వేల 700కోట్లు.. రైతుబంధుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు
నాడు ప్రత్యేక తెలంగాణ కోసం.. నేడు దేశం కోసం కేసీఆర్ మందడుగు వేశారని పేర్కొన్నారు. తెలంగాణ మాదిరిగానే దేశమంతా వ్యవసాయ రంగం సుభిక్షం కావాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు. తెలంగాణ వ్యవసాయ పథకాలు, సంక్షేమ పథకాలు దేశమంతంటా అమలు కావాలని భారత ప్రజలు ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.