Minister KTR : కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకుంటే దేశవ్యాప్త ధర్నా : మంత్రి కేటీఆర్

ఢిల్లీ బీజేపీ వరి వద్దంటే..గల్లీ బీజేపీ వరి వేయమని చెబుతుందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను గందరగోళంలో పడేస్తున్నారని పేర్కొన్నారు.

minister ktr criticized the BJP : ఢిల్లీ బీజేపీ వరి వద్దంటే..గల్లీ బీజేపీ వరి వేయమని చెబుతుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను గందరగోళంలో పడేస్తున్నారని పేర్కొన్నారు. సిరిసిల్లలో తలపెట్టిన ధర్నాలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం దిగిరాకుంటే దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన 10టీవీతో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అన్నదాతల జీవితాలతో ఆటలాడుకుంటుందని మండిపడ్డారు. 60 లక్షల రైతుల జీవితాలతో ఆడుకునే అధికారం బీజేపీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు.

Rajasthan Cabinet : ఢిల్లీ వేదికగా రాజస్తాన్ పంచాయతీ.. సోనియాతో సచిన్ పైలట్ భేటీ!

రైతులు తిరగబడితే ఎడ్ల బండ్ల కింద కొట్టుకుపోతారని ఘాటుగా వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ చేస్తున్న ధర్నా మొదటి దశ మాత్రమేనని…త్వరలోనే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్త ఆందోళనలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు.

కేంద్ర ధాన్యం కొనమని చెప్పిందని గుర్తు చేశారు. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ నిరసన కార్యక్రమానికి రైతులు భారీగా తరలివచ్చారు. ప్లకార్డులు చేతబట్టుకుని నినాదాలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు