Kcr
telangana assembly sessions : ప్రపంచ దేశాల్లో కెనడాలోనే అత్యధిక మొక్కుల ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. కెనడాలో ఒ వ్యక్తికి 10,163 మొక్కలు ఉన్నాయని తెలిపారు. ఫ్రాన్స్ లో 203, చైనాలో 130, లండన్ లో 47 మొక్కలు ఉన్నాయని పేర్కొన్నారు. మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ లో ఒక వ్యక్తికి 28 చెట్లు ఉన్నాయని తెలిపారు. సువిశాలమైన భారతదేశంలో ఒక వ్యక్తికి 28 మొక్కలు మాత్రమే ఉండటం బాధాకరమన్నారు. మొక్కలను ఇష్టానుసారం నరికివేయడమే సమస్యకు కారణమని చెప్పారు.
ప్రపంచమంతా పర్యావరణ పరిస్థితులు మారిపోయాయని తెలిపారు. 5 వేల కిలోమీటర్ల పరిధిలో చైనా కోట్ల మొక్కలు నాటిందని గుర్తు చేశారు. మొక్కల పెంపకం విషయంలో చైనా మనకు ఆదర్శం అన్నారు. సోషల్ ఫారెస్టు ఎంత పెట్టినా, పెంచినా…పది, ఇరవై ఎకరాల అడవికి సమానం కాదన్నారు. ఫారెస్టు అంటే దానిలో ఉండే ఎకో సిస్టమ్, బయోడైవర్సిటీ దాని ద్వారా సక్రమించే అనేక రకాల అద్భుతాలు మనకు రావని తెలిపారు.
Air India Sale: అప్పుల భారంతోనే ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ! ఉద్యోగుల మాటేంటి?
వారసత్వంలో తెలంగాణకు సక్రమించిన ఆస్తి 2కోట్లు, 75 లక్షల ఎకరాలు రాష్ట్ర భూభాగమని పేర్కొన్నారు. దాదాపు 3,100 కిలో మీటర్ల చుట్టు కొలతోటి తెలంగాణ ల్యాండ్ మాస్ తో మనకు వచ్చిన రాష్ట్రం పెద్దగా ఉందేదని.. అయితే ఆంధ్రవాళ్లు పోలవరం కోసం ఏడు మండలాలు తీసుకున్నారు. ఆ తర్వాత మిగిలిన 1లక్షా 12 వేల పైగా చదరపు కిలో మీటర్లు పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం తెలంగాణ భూ విస్తీర్ణం 2 కోట్ల 75 లక్షల ఎకరాలు ఉంటుందని తెలిపారు.
Tribe Dangerous feat : కడుపు నింపుకోవటానికి ప్రాణాలు పణంగా పెడుతున్న గిరిజనులు
రాష్ట్రంలో 2 కోట్ల 75 లక్షల ఎకరాల భూ భాగంలో అటవీశాఖ రికార్టులు, ప్రభుత్వాలు వెలువరించిన వివిధ నోటిఫికేషన్ల ప్రకారం 66 లక్షల 25 వేల ఎకరాలపైగా అటవీ భూములు ఉన్నట్లు రికార్డలున్నాయని తెలిపారు. కానీ మొత్తం అడవులు మాయమైపోయాయని వాపోయారు.
న్యూజిలాండ్ లో రాజకీయ పార్టీ పేరు గ్రీన్ పార్టీ అని తెలిపారు. గ్రీనరి ప్రమోషన్ పైనే ఆ పార్టీ కేంద్రీకృతమై ఉంటుందని తెలిపారు. దానికి దాదాపు పెద్ద సంఖ్యలో ఎంపీలు గెలుస్తుంటారని చెప్పారు. ఆ పార్టీ చేసిన అవగాహన వల్ల ఇప్పుడు ఆ దేశం వన్ ఆఫ్ ది బెస్ట్ పర్యావరణ కండీషన్స్ ఉన్న దేశంగా పేరు ప్రతిష్టలు పొందుతుందన్నారు.