Congress Leader Manikrao Thakre
Congress Leader Manikrao Thakre :పెండింగ్ సీట్లపై స్క్రినింగ్ కమిటీ సమావేశం అయిందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. మరోసారి స్క్రినింగ్ కమిటీ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రకటించాల్సి ఉన్న 64 స్థానాలపై చర్చ జరిపామని వెల్లడించారు. స్క్రీనింగ్ కమిటీ నివేదికను సీఈసీ ముందు ఉంచుతామని తెలిపారు. వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు. త్వరలో సీఈసీ సమావేశం ఉంటుందని వెల్లడించారు.
వామపక్షాలతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వామపక్షాలతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. సీఈసీ తరువాత మరో జాబితా ఉంటుందా లేదా అన్నది తెలుస్తుందన్నారు. ఒక సీటు కోసం అనేక మంది ఆశావహులు ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలుసన్నారు.
BJP : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలపై సందిగ్ధం
బీజేపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. బీసీలకు బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు ఇస్తామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన తెలంగాణలో మరోసారి ఉండేలా ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
కాంగ్రెస్ రెబెల్స్ లేరని స్పష్టం చేశారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి అనేక మంది రావాలనుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించాలనుకుంటున్నారని పేర్కొన్నారు.