Thieves robbed at ATM in Rangareddy : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్టులో మరోసారి ఏటీఎంలో చోరీ జరిగింది. ఇండిక్యాష్ ఏటీఎంను దుండగులు గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. వారం వ్యవధిలో రెండు ఏటీఎంలలో చోరీ జరిగింది. వారం క్రితం యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు.
నగర శివారుల్లోని ఏటీఎంల వద్ద వరుస చోరీలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా లేకపోవడం, సెక్యూరిటీ లేని కారణం వల్లే ఏటీఎంలలో చోరీలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవలికాలంలో యూనియన్ బ్యాంక్ లో చోరీకి యత్నించడం, నిన్నరాత్రి అబ్దుల్లాపూర్ మెట్టు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఇండీక్యాష్ ఏటీఎంలో గ్యాస్ కట్టర్లతో మిషన్లను తొలగించి లక్షల రూపాయలు దొంగిలించినట్లు అక్కడున్న సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్ అధికారులు వచ్చి పరిశీలించిన తర్వాత ఏటీఎంలో ఎంత క్యాష్ చోరీ చేశారనేదానిపై పూర్తి నివేదిక సమర్పించనున్నారు. గతంలో వనస్థలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ ఏటీఎంలో గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మెషిన్లను బ్లాక్ చేసి అందులో ఉన్న 8 లక్షల క్యాష్ ను సొమ్మును చోరీ చేశారు.