Telangana Rains : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

ఉరుములు మెరుపులతోపాటు ఈదురు గాలులతో వర్షాలు వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది.

Telangana Rains : తెలంగాణలో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ద్రోణి, క్యుములోనింబస్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో మూడు రోజులు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతోపాటు ఈదురు గాలులతో వర్షాలు వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది.

శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం, నల్లగొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

Heavy Rain :హైదరాబాద్ లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

శనివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో ఆయా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మే8 నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని తెలిపింది.

గురువారం నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యపేట, మహబూబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షం కురిసింది. గురువారం రాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది.

Heavy Rains : హైదరాబాద్ పై పగబట్టిన వరుణుడు.. నగరంలో కుండపోత వర్షం

నగరంలోని  బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో వాన కుండపోతగా కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో నగరంలోని రోడ్లలపై భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

నగరంలోని పలు కాలనీల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. భారీ వర్షానికి విత్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ లేక పలు బస్తీలు అంధకారంలో ఉన్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు