Heavy Rains : హైదరాబాద్ పై పగబట్టిన వరుణుడు.. నగరంలో కుండపోత వర్షం

నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం పొడిగానే ఉన్నప్పటికీ రాత్రి 7 గంటల తర్వాత మబ్బులు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది. 

Heavy Rains : హైదరాబాద్ పై పగబట్టిన వరుణుడు.. నగరంలో కుండపోత వర్షం

Heay Rain

Heay Rain : గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల ఉదయం, మరికొన్ని చోట్ల సాయంత్రం ఆకాశానికి చిల్లుపడినట్లుగా వర్షం ముంచెత్తింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాత్రం రాత్రి వేళ వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. నగరంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ రోడ్లను వరద నీరు ముంచెత్తింది. డ్రైనేజీలు పొంగిపోర్లాయి. వర్షపు నీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో దాదాపు అరగంటకు పైగా వాన దంచికొట్టింది. దీంతో నగరం మరోసారి జలమయం అయింది. రోడ్లపై వరద నీరు పోటెత్తింది. మోకాళి లోతు నీటి ప్రవాహం కొనసాగడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత నెల ఏప్రిల్ 25, 29 తేదీల్లో కురిసిన కుండపోత వానల నుంచి ఇంకా తేరుకోకముందే ఆదివారం రాత్రి భారీ వర్షం హడలెత్తించింది.

Telangana Rains : తెలంగాణలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలో కుండపోత వాన, ఆందోళనలో అన్నదాతలు

నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం పొడిగానే ఉన్నప్పటికీ రాత్రి 7 గంటల తర్వాత మబ్బులు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది.  భారీ వర్షంతో సికింద్రాబాద్, ట్యాంక్ బండ్, మాసబ్ ట్యాంక్, ఎల్ బీ నగర్, దిల్ సుఖ్ నగర్, టోలీచౌకీ, హైటెక్ సిటీ, కూకట్ పల్లి, జేఎన్ టీయూ మార్గాల్లో ట్రాఫిక్ స్థంభించింది.

Heavy Rains : తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు

ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్, షేక్ పేట్, టోలీచౌకీలో చెట్లు కూలాయి. సికింద్రాబాద్, హయత్ నగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. కొన్ని ఇళ్లల్లోకి వర్షపు నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షం కారణంగా వివిధ ప్రాంతాల్లో్ ట్రాఫిక్ స్థంభించింది. ఈదురుగాలుల కారణంగా పలు కాలనీలు, బస్తీలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమ్తతం అయింది. బల్దియా టీమ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. నగర ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని, బయటికి రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.