Thummala Nageswara Rao Nomination
Thummala Nageswara Rao Nomination : ఖమ్మం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే ఆదేశాలతో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు.
ఖమ్మం అభివృద్ధి, ప్రజల అవసరాలను తీర్చడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు. ఖమ్మం అభివృద్ధి కోసం గతం కంటే ఎక్కువగా పని చేస్తానని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. ప్రజాహితమైన, ప్రజా రంజికమైన పాలన అందించాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు.
తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కాంగ్రెస్ పార్టీని గెలిపించి గిఫ్ట్ ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు పక్కాగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో అరాచక పాలన పోగొట్టడానికి ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.