Thunderstorm On Bike
Thunderstorm on bike : మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వర్షం పడుతున్న సమయంలో భార్యభర్తలు తమ మూడేళ్ల కొడుకుతో బైక్ పై వెళ్తుండగా ఘోరం జరిగింది. ఈ బైక్ పై పిడుగుపడింది. స్పాట్ లోనే తల్లి, మూడేళ్ల కొడుకు ప్రాణాలు విడిచారు. తండ్రి అక్కడే కుప్పకూలిపోయాడు.
కొడుక్కు జ్వరం రావడంతో.. హాస్పిటల్ కు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. తిరుగు ప్రయాణంలో… మంచిర్యాల ఫ్లై ఓవర్ మీద నుంచి వస్తుండగా ఈ దారుణం జరిగింది. ఫ్లై ఓవర్ మీద ఉండగానే.. బైక్ పై పిడుగుపడింది. మూడేళ్ల బాబు .. తల్లి-తండ్రి మధ్య కూర్చున్నాడు. పిడుగుపాటు షాక్ తో… తల్లి, బాలుడు చనిపోయారు. తండ్రి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు పోలీసులకు, అంబులెన్స్ కు సమాచారం అందించారు.
Read More : Adivi Sesh : అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన టాలీవుడ్ నటుడు అడివి శేష్..
హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తండ్రి ప్రాణాలతో ఉండటం గమనించి… మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చరీకి తరలించారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.