కొమురం భీం జిల్లా సిర్పూర్ మండలానికి మళ్లీ పులి టెన్షన్ పట్టుకుంది. రాష్ట్ర సరిహద్దు దాటి మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాల్లో పశువులపై దాడి చేసిన పులి.. మళ్లీ సిర్పూర్-టీ మండలం ఇటుకల పహాడ్ అడవిలోకి ప్రవేశించింది.
దీంతో పులిని ట్రాక్ చేసేందుకు మహారాష్ట్ర ఫారెస్ట్ అధికారుల సాయం కోరారు తెలంగాణ అటవీశాఖ అధికారులు. ఇందుకు సంబంధించి మహారాష్ట్రలోని మాకిడిలో ఇరు రాష్ట్రాల ఫారెస్ట్ అధికారుల కోర్డినేషన్ మీటింగ్ కూడా జరిగింది.
సిర్పూర్-టీ మండలం ఇటుకల పహాడ్ అడవిలోకి పులి ప్రవేశించిందని అధికారులు నిర్ధారించారు. చాలా రోజులుగా పులి డ్రోన్లకు, సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలకు చిక్కకపోవడంతో మహారాష్ట్ర నిపుణుల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు.
ప్రస్తుతం మహారాష్ట్రలోని మాకిడిలో ఇరు రాష్ట్రాల ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది సమావేశమయ్యారు. కాగా, ఇటుకల పహాడ్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దపులి అడుగులను అధికారులు గుర్తించారు.
సమీప గ్రామాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. గుంపులుగా వెళ్లడంతో పాటు తలకు వెనుక వైపు మాస్కులు ధరించాలని ఫారెస్ట్ సిబ్బంది సూచించారు. ఇప్పటికే ఇద్దరిపై దాడి చేసింది పెద్దపులి. కెమెరాలకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతోంది.
K Laxman: అందుకే పార్లమెంట్ సమావేశాలు జరగకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోంది: కే లక్ష్మణ్