K Laxman: అందుకే పార్లమెంట్ సమావేశాలు జరగకుండా కాంగ్రెస్‌ అడ్డుకుంటోంది: కే లక్ష్మణ్

దేశ వ్యతిరేక వార్తలు వచ్చిన ప్రతిసారి రాహుల్ గాంధీ వాటిని అందుకుని నానా హంగామా చేస్తున్నారని తెలిపారు.

K Laxman: అందుకే పార్లమెంట్ సమావేశాలు జరగకుండా కాంగ్రెస్‌ అడ్డుకుంటోంది: కే లక్ష్మణ్

BJP leader Laxman

Updated On : December 6, 2024 / 2:42 PM IST

కాంగ్రెస్‌ పార్టీపై బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుంటే, చూసి ఓర్వలేని విదేశీ దుష్టశక్తులు తప్పుడు వార్తలు సృష్టిస్తున్నాయని చెప్పారు.

వాటిని పట్టుకుని ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమావేశాలు జరగకుండా అడ్డుకుంటోందని కే లక్ష్మణ్ విమర్శించారు. భారత్‌లో అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు వ్యతిరేకంగా “ఆర్గనైజ్డ్ క్రైం అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు (OCCRP)” తప్పుడు కథనాలు ఇస్తే, వాటిని ఆధారంగా చేసుకుని రాహుల్ గాంధీ విమర్శలు చేశారని చెప్పారు.

దేశ వ్యతిరేక వార్తలు వచ్చిన ప్రతిసారి రాహుల్ గాంధీ వాటిని అందుకుని నానా హంగామా చేస్తున్నారని తెలిపారు. ఈ సంస్థతో రాహుల్ గాంధీకి ఉన్న సంబంధాలను ఫ్రెంచ్ పత్రిక మీడియాపార్ట్ ప్రచురించిందని చెప్పారు. తెలంగాణలో మోసపూరిత హామీలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని లక్ష్మణ్ అన్నారు. తప్పుడు ప్రచారాలను, అసత్య హామీలను ఎండగడతామని తెలిపారు.

KTR: రేవంత్ రెడ్డికి కేటీఆర్ కీలక సూచన.. నువ్వు అలాచేస్తే తప్పకుండా గౌరవిస్తాం