Tirupati-Karimnagar Express: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. కరీంనగర్-తిరుపతి రైలు సమయాల్లో మార్పు.. పూర్తి డీటెయిల్స్ ఇవే

తెలంగాణ ప్రాంతం నుండి తిరుపతికి వెళ్లే వేలాది మంది భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (Tirupati-Karimnagar Express)కీలక సమాచారాన్ని అందించింది.

Tirupati karimnagar express train timings changed sc railway

  • మారిన తిరుపతి ఎక్స్‌ప్రెస్ సమయాలు
  • అక్టోబర్ పది నుండి అమలు
  • ప్రయాణికులు మార్పులు గమనించగలరు

Tirupati-Karimnagar Express: తెలంగాణ ప్రాంతం నుండి తిరుపతికి వెళ్లే వేలాది మంది భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సమాచారాన్ని అందించింది. ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి, వారి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడానికి రైల్వేశాఖ నిరంతరం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అందులో భాగంగా కరీంనగర్-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే కీలక రైలు సర్వీస్ సమయాల్లో మార్పులు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Cm Chandrababu: 90 ఏళ్ల అవ్వ జీవితకాల కోరిక.. నేరుగా వచ్చి కల్సిన సీఎం చంద్రబాబు

అక్టోబర్ 10 నుండి కొత్త టైమింగ్స్ అమలు:

ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తిరుపతి-కరీంనగర్ (12761) ఎక్స్‌ప్రెస్ (Tirupati-Karimnagar Express)టైమింగ్స్‌ను సవరించారు. కొత్త వేళల ప్రకారం ఈ రైలు రాత్రి 8:05 గంటలకు కాకుండా 19:50 గంటలకే (రాత్రి 7:50) తిరుపతిలో బయల్దేరుతుంది. ఆ తర్వాత రేణిగుంటకు 20:15 గంటలకు, శ్రీకాళహస్తికి 20:39 గంటలకు చేరుకుంటుంది. ఈ మారిన సమయాలు అక్టోబర్ 10వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.

ప్రధాన స్టేషన్లలో నిలుపుదల, భక్తులకు తీవ్ర లబ్ధి:

ఈ రైలు ఆదివారం రాత్రి తిరుపతిలో బయల్దేరి సోమవారానికి కరీంనగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సోమవారం సాయంత్రం కరీంనగర్‌లో బయల్దేరి మంగళవారం ఉదయానికి తిరుపతి చేరుకుంటుంది. ఈ సర్వీస్ పెద్దపల్లి, జమికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, గూడూరు మీదుగా ప్రయాణిస్తుంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల భక్తులకు శ్రీవారి దర్శనార్థం వెళ్లడానికి ఈ రైలు సమయాల మార్పు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.