అక్కడ బొగ్గు తవ్వితే గ్రామాల్లో చిచ్చు పెట్టినట్టే.. ఉద్యమానికి వెనుకాడబోం : కోదండరాం

తెలంగాణ వర్తమాన అభివృద్ధికి సింగరేణి ఎంతో ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం వినకపోతే సింగరేణి పరిరక్షణ కోసం ..

TJS President Kodandaram : సింగరేణి ఎంతో సమర్థవంతంగా బొగ్గు తవ్వకాలు చేస్తోంది. వేలం వేయడం కంటే సింగరేణి నుంచి ఆదాయం ఎక్కువగా వస్తుందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. ఇందిరా గాంధీ బొగ్గు తవ్వకాలను జాతీయం చేసింది.. సుప్రీంకోర్టు బొగ్గు గనుల వేలంకు అనుమతి ఇచ్చింది.. ప్రైవేటీకరణ ద్వారా జరిగే అక్రమాలను నివారించేందుకు సుప్రీంకోర్టు చెప్పింది. సింగరేణి నుంచి ఆదాయం ఎక్కువగా వస్తుంది.. సింగరేణి వల్ల స్థానికులకూ ఉపాధి కలిగింది. సింగరేణి ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటిదని కోదండరాం అన్నారు.

Also Read : పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ మాట్లాడడం హాస్యాస్పదం: షబ్బీర్ అలీ

సింగరేణి పరిదిలో ప్రజలు ఆర్థికంగా ఎదిగారు.. సామాజిక మార్పుకు కారణం అయ్యిందని కోదండరాం అన్నారు. బొగ్గు గనులు వేలం వేయకుండా రాష్ట్ర ప్రభుత్వంసైతం ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సింగరేణికి మినహాయింపు ఇవ్వాలని కోదండరాం కోరారు. ఈ గనులు సింగరేణికి ఇవ్వకపోతే పదేళ్లలో సంస్థ తీవ్రంగా నష్టపోతుంది. శ్రావణపల్లి గని తవ్వే ప్రాంతం అటవీ భాగం ఎక్కువగా ఉంది. ఇక్కడ బొగ్గు తవ్వితే గ్రామాల్లో చిచ్చు పెట్టినట్టే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేస్తాం.

Also Read : ఎంపీలుగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు.. పంచెకట్టులో కిషన్ రెడ్డి..

తెలంగాణ వర్తమాన అభివృద్ధికి సింగరేణి ఎంతో ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం వినకపోతే సింగరేణి పరిరక్షణ కోసం ఉద్యమం చేసేందుకు వెనుకాడబోమని కోదండరాం హెచ్చరించారు. సేవ్ సింగరేణిని తిరిగి ప్రారంభిస్తాం. ప్రైవేటు వారికి గనుల కేటాయింపు ద్వారా ఎలాంటి లాభం జరగదు. స్థానికులు ఉపాధి అవకాశాలు కోల్పోతారని కోదండరాం చెప్పారు.

 

 

ట్రెండింగ్ వార్తలు