Jangaon Toxic Gas Leak : జనగామలో విషవాయువుల కలకలం.. పలువురికి అస్వస్థత, భయాందోళనలో స్థానికులు

జనగామ జిల్లా కేంద్రంలో విషవాయువులు కలకలం రేపాయి. గీతానగర్ కాలనీ సమీపంలో క్లోరైడ్ సిలిండర్ లీక్ అయ్యింది. వాటర్ ట్యాంక్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. విషవాయువులు లీక్ కావడంతో 40మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Jangaon Toxic Gas Leak : జనగామ జిల్లా కేంద్రంలో విషవాయువులు కలకలం రేపాయి. గీతానగర్ కాలనీ సమీపంలో క్లోరైడ్ సిలిండర్ లీక్ అయ్యింది. వాటర్ ట్యాంక్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. విషవాయువులు లీక్ కావడంతో 40మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Also Read..Turkey Earthquake : టర్కీలో మరో ఘోరం.. పేలిన గ్యాస్ పైప్ లైన్, భయాందోళనలో జనం

జనగామ జిల్లా కేంద్రంలో ఉన్న కోర్టు సమీపంలో ఈ ఘటన జరిగింది. విషవాయువు లీక్ కావడంతో సమీపంలో ఉండే ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. గీతానగర్ కాలనీలోని వాటర్ ట్యాంక్ లో కలిపేందుకు అక్కడ క్లోరైడ్ సిలిండర్ ఉంచారు. దాని నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిందో అర్థం కాక జనగామ పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Also Read..Tirupati Accident : తిరుపతి జిల్లాలో భారీ ప్రమాదం.. గ్యాస్ పైప్ లైన్ లో పేలుడు

కోర్టు సమీపం నుంచి చేర్యాల వైపు వెళ్తున్న వారు, అదే విధంగా జనగామ వైపు వస్తున్న బాటసారులు సహా మొత్తం 40మంది ఇప్పటివరకు అస్వస్థతకు గురయ్యారు. దఫదఫాలుగా 40 మంది ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. వారందరికి చికిత్స అందిస్తున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదు. అయితే అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం.