Turkey Earthquake : టర్కీలో మరో ఘోరం.. పేలిన గ్యాస్ పైప్ లైన్, భయాందోళనలో జనం

భూకంపం ధాటికి టర్కీ, సిరియా కకావికలం అయ్యాయి. ఎటు చూసినా కూలిన బిల్డింగ్ లే దర్శనం ఇస్తున్నాయి. హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తన్నాయి. ఇది చాలదన్నట్టు టర్కీ ప్రజలకు మరో కష్టం వచ్చి పడింది. భూకంపం కారణంగా ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి.

Turkey Earthquake : టర్కీలో మరో ఘోరం.. పేలిన గ్యాస్ పైప్ లైన్, భయాందోళనలో జనం

Turkey Earthquake : భూకంపం ధాటికి టర్కీ, సిరియా కకావికలం అయ్యాయి. ఎటు చూసినా కూలిన బిల్డింగ్ లే దర్శనం ఇస్తున్నాయి. హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తన్నాయి. ఇది చాలదన్నట్టు టర్కీ ప్రజలకు మరో కష్టం వచ్చి పడింది. భూకంపం కారణంగా ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి.

దక్షిణ టర్కీలో గ్యాస్ పైప్ లైన్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయ ఏర్పడింది. దక్షిణ టర్కీలోని గాజియాంటెప్ కు నైరుతి దశలో 170 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. భూకంప తీవ్రతకు మంటలు చెలరేగి ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతంలో గ్యాస్, చమురు పైప్ లైన్లు ఉన్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Frank Hoogerbeets : టర్కీ, సిరియాలో భారీ భూకంపాన్ని ముందే ఊహించిన ఫ్రాంక్.. 3రోజుల క్రితమే ట్వీట్

టర్కీ, సిరియాలో భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. భూకంప ఘటనలో అపారమైన ప్రాణనష్టం జరిగింది. భూకంప మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మృతుల సంఖ్య వెయ్యి నుంచి 10వేల మధ్య ఉండే అవకాశాలు ఉన్నట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. ఈ ప్రాంతంలో వచ్చిన భూకంపాల చరిత్రను బట్టి యూఎస్ జీఎస్ ఈ అంచనా వేస్తోంది. మృతుల సంఖ్య పెరగడంతో పాటు భారీ నష్టం కలగనున్నట్లు చెప్పింది. ఇప్పటికే పలుసార్లు భూమి కంపించడంతో మృతుల సంఖ్య 2వేల 300కి చేరుకుంది.

టర్కీలో మూడుసార్లు భూమి కంపించగా.. 3వేలకు పైగా భారీ భవనాలు నేలకూలాయి. వాటిలో నివసిస్తున్న వేలాది మంది చనిపోయారు. అనేకమంది నిరాశ్రయులయ్యారు.

Also Read..Earthquake In Turkey: టర్కీ, సిరియాల్లో భూకంపం దాటికి నేల మట్టమైన భవనాలు..

కాగా.. టర్కీ, సిరియాలో భూకంపాన్ని సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వేకు చెందిన పరిశోధకుడు ఫ్రాంక్ హుగర్బీట్స్ 3 రోజుల ముందే అంచనా వేశాడు. దక్షిణ మధ్య టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్ ప్రాంతంలో త్వరలో లేదా మున్ముందు రిక్టర్ స్కేల్ పై 7.5 తీవ్రతతో భూకంపం సంభవిస్తుందని ఫ్రాంక్ ట్వీట్ చేశారు. అయితే, ఆయనను సూడో సైంటిస్ట్ అని, గతంలో ఆయన అంచనాలను ప్రశ్నిస్తూ పలువురు నెటిజన్లు ట్విట్టర్ లో ప్రశ్నించారు.

వరుస భూకంపాలు టర్కీని వణికించాయి. గంటల వ్యవధిలోనే మూడు సార్లు భూమి కంపించింది. వరుసగా సంభవిస్తున్న భూకంపాలతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.

భారీ భూకంపాలు టర్కీ, సిరియాను కుదిపేశాయి. సోమవారం తెల్లవారుజామున అంతా గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వేలమంది శిథిలాల కింద నలిగిపోయి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. పసికందులు కూడా ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలు కలిచివేస్తున్నాయి. ఉదయం, సాయంత్రం.. మొత్తం మూడు సార్లు భారీగా భూమి కంపించడంతో టర్కీ, సిరియాలో అంతులేని విషాదం అలుముకుంది.