Tirupati Accident : తిరుపతి జిల్లాలో భారీ ప్రమాదం.. గ్యాస్ పైప్ లైన్ లో పేలుడు

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు సెజ్ సమీపంలో భారీ ప్రమాదం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఇంటింటికీ గ్యాస్ సరఫరాకు సంబంధించి ఓ ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీ చేపట్టిన గ్యాస్ పైప్ లైన్ లో పేలుడు సంభవించింది.

Tirupati Accident : తిరుపతి జిల్లాలో భారీ ప్రమాదం.. గ్యాస్ పైప్ లైన్ లో పేలుడు

Tirupati

Updated On : February 11, 2023 / 12:37 PM IST

Tirupati Accident : తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు సెజ్ సమీపంలో భారీ ప్రమాదం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఇంటింటికీ గ్యాస్ సరఫరాకు సంబంధించి ఓ ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీ చేపట్టిన గ్యాస్ పైప్ లైన్ లో పేలుడు సంభవించింది. 35 అడుగుల మేర పైకి రాళ్లు, మట్టి పైకి లేచాయి. పైప్ లైన్ నిర్మిస్తున్న క్రమంలో ఈ పేలుడు జరిగింది.

పెద్ద శబ్ధంతో దాదాపు 35 అడుగుల మేర పైకి మట్టి రాళ్లు ఎగిరి పడి సుమారు 5 అడుగుల లోతు గోతి ఏర్పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి సమయం కావడం, సమీపంలో నివాసాలు, జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే, సమీప డాబాలో ఉన్న కొంత మంది మాత్రం భయంతో పరుగులు తీశారు.

Gas Pipeline Leak : కృష్ణా జిల్లాలో పగిలిన గ్యాస్ పైప్‌లైన్, ఆందోళనలో స్థానికులు

దుకాణాలు మూసి ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్టైంది. గత సంవత్సర కాలం నుంచి జాతీయ రహదారి సమీపంలో ఉజిలి వద్ద మేనకూరు పరిశ్రమ వాడ సమీపంలో పైప్ లైన్ నిర్మిస్తున్న సంస్థ ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.