Gas Pipeline Leak : కృష్ణా జిల్లాలో పగిలిన గ్యాస్ పైప్‌లైన్, ఆందోళనలో స్థానికులు

కృష్ణా జిల్లా అవనిగడ్డలోని సీతయ్యలంక మండలిపురంలో మెగా గ్యాస్ పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో మంటలు ఎగసిపడ్డాయి. గ్యాస్ పైప్ లైన్ పగిలి మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Gas Pipeline Leak : కృష్ణా జిల్లాలో పగిలిన గ్యాస్ పైప్‌లైన్, ఆందోళనలో స్థానికులు

Gas Pipeline Leak

Gas Pipeline Leak : కృష్ణా జిల్లా అవనిగడ్డలోని సీతయ్యలంక మండలిపురంలో మెగా గ్యాస్ పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో మంటలు ఎగసిపడ్డాయి. గ్యాస్ పైప్ లైన్ పగిలి మంటలు ఎగసిపడటంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఎలాంటి దారుణం జరుగుతుందోనని భయాందోళనకు గురయ్యారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

వెంటనే కాలనీవాసులు ఓఎన్జీసీకి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఓఎన్జీసీ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని జనసేన నాయకులు, కార్యకర్తలు నిన్న నిరసన దీక్ష చేపట్టారు. రాత్రి కూడా దీక్ష కొనసాగించారు. దీంతో స్పందించిన అధికారులు కాలనీవాసులతో చర్చించి నిలిచిన మురుగు నీటిని మళ్లించేందుకు తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో మెగా గ్యాస్ పైప్ లైన్ పగిలిపోవడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఓఎన్జీసీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

India – Turkmenistan: భారత్ వరకు గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణాన్ని పునరుద్దరించనున్న తుర్క్‌మెనిస్తాన్

కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని అవనిగడ్డ సీతయలంక మండలిపురంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని జనసేన ఆధ్వర్యంలో నిరసన దీక్షను చేపట్టారు. సమస్యలను పరిష్కరిస్తే తప్ప దీక్ష విరమించేది లేదని కాలనీవాసులు, జనసేన నాయకులు స్పష్టం చేశారు. నిన్న రాత్రి కూడా దీక్ష కొనసాగింది. రంగంలోకి దిగిన అధికారులు చర్చలు జరిపారు. కాలనీలో నిలిచిన మురుగునీటిని బయటికి మళ్లించేందుకు ఆదివారం ఉయదం ప్రొక్లైన్ సాయంతో తవ్వకాలను చేపట్టారు.

ఈ క్రమంలో మెగా గ్యాస్ పైప్ లైన్ పగిలిపోయింది. గ్యాస్ లీక్ అయ్యింది. ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో కాలనీవాసులు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం తప్పడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.