Mahesh Goud : మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్ ఫైర్..

Mahesh Goud : కేబినెట్‌లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mahesh Goud

Mahesh Goud : స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేసిన రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌పై (Mahesh Goud) టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు.

రిజర్వేషన్ల అంశంతో ముడిపడిన స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నిన్న (ఆదివారం) పొంగులేటి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పీసీసీ చీఫ్ ఫైర్ అయ్యారు.

కేబినెట్‌లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపైన వేరొకరు మాట్లాడ్డం ఏంటని ప్రశ్నించారు.

కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి జాగ్రత్తగా ఉండాలని పీసీసీ సూచించారు.

Read Also : Census: జనగణనకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ.. రెండు దశల్లో నిర్వహణ

పార్టీ‌తో సంప్రదించకుండా అలాంటి ప్రకటనలు చేయవద్దని పీసీసీ చీఫ్ సూచించారు. మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలను మాట్లాడాలని సెన్సిటివ్ అంశాలను, కోర్టు పరిధిలో అంశాలను మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పీసీసీ సూచనలు చేశారు.