Revanth Reddy: రైతుల పంటను ప్రభుత్వం కొనే వరకు ముందుండి పోరాడుతా: ఎల్లారెడ్డి సభలో రేవంత్

తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజ కోనేవరకు తాను ముందుండి పోరాడుతానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు

Revanth

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజ కోనేవరకు తాను ముందుండి పోరాడుతానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన “మన ఊరు మన పోరు” బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించే పంటను గిట్టుబాటు ధరకు కొనొచ్చని, అందుకు ప్రత్యేకంగా నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని రేవంత్ అన్నారు. రూ.10 వేల కోట్లు ఉంటే రైతుల పంటలను కొనొచ్చని అందుకోసం రూ. 2.5 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ నుంచి కాస్త నిధులు ఇటు కేటాయిస్తే సరిపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనలేకుంటే మరి రైతులు ఏమవ్వాలని ఆయన ప్రశ్నించారు.

Also Read:Somuveerraju : 2024లో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : సోమువీర్రాజు

తెలంగాణ రైతుల పంటను కొనాలంటూ కేంద్రంతో కలిసి కేసీఆర్ కొత్త డ్రామాలాడుతున్నారని రేవంత్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పంటను కొనుగోలు చేస్తే మరి కేసీఆర్ ఏమి చేస్తారని రేవంత్ ప్రశ్నించారు. “మోడీ కొంటాడో లేదో మాకు అవసరం లేదు.. రైతులు పండించిన ప్రతి గింజ కొనాలి.. 7500 ఐకెపి కేంద్రాలు తెరవాలి, గోనె సంచులు కొనాలి.. లేకపోతే కేసీఆర్ ను గద్దె దించుతాం” అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. “రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి పంటను కొనుగోలు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రైతులను పోగేసి ఉప్పెనేలా వచ్చి..నీ ఫామ్ హౌస్ ను కప్పేస్తా..దుడ్డు కర్రల దండు కడదాం.. సైన్యాన్ని నిర్మిస్తాం.. ఫామ్ హౌస్ ను ముట్టడిస్తాం..సునామీ సృష్టిస్తా” అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.

Also read:Bandi Sanjay On Bodhan : ఛత్రపతి శివాజీ విగ్రహం ఎందుకు పెట్టొద్దు? బోధన్ ఘటనపై బండి ఆగ్రహం

కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండించిన పంటలను ఎవరు ఎంత ధరకు కొంటున్నారో వారే తెలంగాణలోని మిగతా రైతుల పంటలను కొనేవరకు నేను ముందుండి పోరాడుతానని రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి గడ్డ మీద మరోసారి కాంగ్రెస్ గెలుస్తుందని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడి కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేసి వెళ్లిన వారికి రాజకీయ భవిష్యత్తు ఉండబోదని రేవంత్ అన్నారు. కల్లాల్లో కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిలో తిరిగామని, ఇక్కడ రైతులను చూస్తే పంజాబ్, హర్యానా రైతుల్లాగా పోరాట స్ఫూర్తి గుర్తుకు వస్తుందని రేవంత్ పేర్కొన్నారు. మూడు నల్ల వ్యవసాయ చట్టాలు తెస్తే పంజాబ్ రైతులు పోరాటం చేసి ఆ చట్టాలను బొంద పెట్టారని..ఎల్లారెడ్డిలో వరి పండించిన రైతులను మోసం చేస్తే నడి బజార్లో ఉరి తీస్తామని అపుడే చెప్పానని రేవంత్ వ్యాఖ్యానించారు.

Also read:General Strike : మార్చి28, 29 తేదీల్లో ట్రేడ్ యూనియన్స్ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

కేసీఆర్ కూతురు కవిత ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన సమయంలో వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్నారని.. కానీ 1500 రోజులు గడిచినా షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోవడంతో ఆమెను ప్రజలు ఎలా ఓడించారో టీఆర్ఎస్ నేతలు గమనించాలని రేవంత్ పేర్కొన్నారు. పసుపు బోర్డ్ తెస్తానన్న బీజేపీ ఎంపీ ఇప్పుడు అడ్రెస్స్ లేడని, ఎర్ర జొన్నలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తా అని కేసీఆర్ మోసం చేసాడని.. ఇలా చెల్లని వాగ్దానాలు ఇచ్చి రైతులను మోసం చేస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతులను కేసీఆర్ ఇప్పుడు వరి వేయొద్దని అంటున్నారని అయితే.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా, ఉచిత కరెంటు ఇస్తానన్నా కేసీఆర్ మరి రైతులను ఏమి పండించాలో చెప్పలేకపోతున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు.