TPCC Chief Revanth Reddy : రేవంత్‌రెడ్డి కర్ణాటక పర్యటన

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం బెంగుళూరు వెళ్లారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డికే శివకుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.

Tpcc Chief Revanth Reddy Meets Dk Siva Kumar

TPCC Chief Revanth Reddy :  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం బెంగుళూరు వెళ్లారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డికే శివకుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈనెల 7 న జరిగే తన పదవీ బాధ్యత స్వీకార కార్యక్రమానికి రావల్సిందిగా ఆయన్న ఆహ్వానించారు.   అనంతరం ఆయన రాజ్యసభ  ప్రతిపక్షనేత, కేంద్ర మాజీ మంత్రి  మల్లికార్జున ఖార్గేను కలిసి  తన పదవీ బాధ్యత స్వీకార కార్యక్రమానికి రావల్సిందిగా కోరారు.

Tpcc  Chief Revanth Reddy Meets Kpcc Chief Dk Shivakumar

మరో వైపు టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి ఊహించిన దానికంటే రెట్టింపు వేగంతో పని చేసుకు పోతున్నారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు అందర్ని కలుపుకుపోయే ఆలోచనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎంపికను వ్యతిరేకించిన సీనియర్ నేత హనుమంతరావును ఆస్పత్రికి వెళ్లి మరీ పరామర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతిగా పని చేసిన  కాంగ్రెెస్ పార్టీ సీనియర్ నేత కే. రోశయ్య ఇంటికి వెళ్లి తన పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావల్సిందిగా కోరి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

Tpcc Chief Revanth Reddy Meets Ex-CM K. Rosaiah

దివంగత కాంగ్రెస్ నేత, ఒకప్పటి సీల్పీ నేత పీజేఆర్ ఇంటికి వెళ్లి ఆయన కుమారుడు విష్ణును కలిశారు. ఈ సందర్భంగా పీజేఆర్ చరిత్రను రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్ అంటే పీజేఆర్.. పీజేఆర్ అంటే కాంగ్రెస్ అనిపించారని.. సీఎల్పీ నేతగా అప్పటి ప్రభుత్వాలను గడగడలాడించారని.. హైదరాబాద్ కు కృష్ణా జలాల కోసం పీజేఆర్ పోరాటం చేశారని పేర్కొన్నారు.  పీజేఆర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే.. విష్ణుకి అండగా నిలబడాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు.