శ్రీరామచంద్రుని నిజమైన వారసుడు రాహుల్ గాంధీయే : జగ్గారెడ్డి

రాహుల్ గాంధీ ప్రజలకోసం పోరాడే ఫైటర్. మోదీ పవర్ కోసం వచ్చిన లీడర్. అధికారంలో నుంచి వచ్చిన లీడర్ మోదీ.. ప్రజల నుంచి వచ్చిన లీడర్ రాహుల్ గాంధీ అని జగ్గారెడ్డి అన్నారు.

Jaggareddy : రాహుల్ గాంధీ చరిత్ర.. రాజకీయం మీద బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులకు స్పష్టంగా చెబుతున్నా.. దేశ రాజకీయాలు రాహుల్ గాంధీ, మోదీ చుట్టే తిరుగుతున్నాయి. రాహుల్ గాంధీకి మోదీకి చాలా వ్యత్యాసం ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అద్వానీ రథయాత్రకు ముందు దేశానికి.. గుజరాత్ కు మోదీ ఎవరో కూడా తెలియదు. అద్వానీ రథయాత్ర పూర్తి అయ్యాక.. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా మోదీ గెలిచిన తర్వాత అద్వానీ సిల్డ్ కవర్లో సీఎంగా ప్రకటించారు. బీజేపీ నేతలు మోదీ సీల్డ్ కవర్ సీఎం కాదని చెప్పగలరా అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. సీఎంలను డిసైడ్ చేసే రాహుల్ గాంధీకి.. సీల్డ్ కవర్ సీఎం మోదీకి చాలా తేడా ఉంది. మోదీ ప్రధాని కాకముందు ఏ పోరాటం చేశారో బీజేపీ నేతలు చెప్పాలంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Also Read : Alleti Maheshwar Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్ట్ సంక్షోభం..!- బాంబు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే

రాహుల్ గాంధీ ప్రజలకోసం పోరాడే ఫైటర్. మోదీ పవర్ కోసం వచ్చిన లీడర్. అధికారంలో నుంచి వచ్చిన లీడర్ మోదీ.. ప్రజల నుంచి వచ్చిన లీడర్ రాహుల్ గాంధీ అని జగ్గారెడ్డి అన్నారు. పేదలకోసం రాముడు పాలన చేశారు. గుడి నిర్మాణం చేస్తే సంతోషిస్తా అని రాముడు అనలేదు. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్ లు రాజకీయంగా బతకాలంటే.. జై శ్రీరామ్ అనక తప్పదు. రామాలయ నిర్మాణంతో సమస్యలు పోయాయా? శ్రీరామ చంద్రుని నిజమైన వారసుడు రాహుల్ గాంధీయే. రాముడి ఆదర్శరాలను నిలబెట్టే వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమే అని జగ్గారెడ్డి అన్నారు. గుళ్లు కడితే ఉద్యోగాలు వస్తాయా? యువత ఆలోచించాలని జగ్గారెడ్డి సూచించారు.

 

ట్రెండింగ్ వార్తలు