RTC bus tracking app
RTC Bus Tracking App Gamyam: హైదరాబాద్ లో ఎంజీబీఎస్ వద్ద ఆర్టీసీ బస్ ట్రాకింగ్ యాప్ గమ్యంను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ టైంలో డీజిల్ రేట్స్ పెరిగి టీఎస్ఆర్టీసీ ఇబ్బంది పడిందని చెప్పారు. అన్ని సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ రెండేళ్లలో ఆర్టీసీకి ప్రయాణికులు బాగా సపోర్ట్ చేశారని పేర్కొన్నారు.
ప్రస్తుతం 45 లక్షల మంది ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులు, అధికారుల కృషి వల్ల ఆ ఘనత దక్కిందన్నారు. ఆర్టీసీ అభివృద్ధికి కొత్త ఇనీషియేటివ్స్ తీసుకున్నామని చెప్పారు. 776 బస్సులను కొనుగోలు చేశామని, త్వరలో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. బస్ స్టాండ్స్ అభివృద్ధికి రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
రెండేళ్లుగా సిబ్బంది వెల్ఫేర్ కోసం నెల ఒక రోజు సాలీరిస్ ఇస్తున్నామని వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల అనారోగ్య సమస్యలను గుర్తించేందుకు ప్రతి డిపోలో ఒక హెల్త్ వాలంటరీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రజలకు ఆర్టీసీని దగ్గర చేర్చడానికి ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. విలేజ్ వాలంటీర్స్ తో ప్రజలకు ఆర్టీసీని దగ్గర చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
మ్యాప్ మై ఇండియా సహకారంతో శనివారం గమ్యం యాప్ ను ప్రారంభించామని తెలిపారు. వెహికిల్ ట్రాకింగ్ యాప్ తీసుకొచ్చామని పేర్కొన్నారు. దీని ద్వారా ప్రయాణికులు మరింత సులభతరంగా తమ జర్నీ కొనసాగిస్తారని తెలిపారు. ప్రయాణికులకు ఉన్న రకరకాల సమస్యలకు ఈ యాప్ ఉపయోగ పడుతుందన్నారు. ఈ యాప్ ద్వారా ఆర్టీసీ బస్సుల యాక్సిడెంట్స్ ఎనాలసిస్ చేసేందుకు ఉపయోగ పడుతుందని తెలిపారు.
Telangana Assembly Session 2023: ఆర్టీసీ విలీనం బిల్లుకు శాసనసభ ఆమోదం.. సంబరాల్లో ఆర్టీసీ కార్మికులు
ప్రజల నుండి వచ్చిన కంప్లీన్ట్స్ తో ఈ యాప్ తెచ్చామని చెప్పారు. స్మార్ట్ ఫోన్ ద్వారా యాప్ ను వేసుకొని తమ గమ్య స్థానాలకు వెళ్లే బస్సుల సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు. మహిళల భద్రత కోసం ఈ గమ్యం యాప్ ద్వారా ఫ్లాగ్ ఏ బస్ ఫీచర్ తో రాత్రుల్లో బస్ స్టాప్ లు లేని ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నారు. బస్సు స్టాప్ నియర్ మీ ద్వారా బస్సు స్టాప్ ల పూర్తి సమాచారం చూపిస్తుందని తెలిపారు.
రాత్రి 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఫ్లాగ్ ఏ బస్సు ఫీచర్ యాప్ లో ఆన్ లో ఉంటుందని చెప్పారు. ఈ యాప్ ప్రయాణికులకు, బస్సు డ్రైవర్లకు ఉపయోగపడుతుందన్నారు. ప్రజలందలూ గమ్యం యాప్ ను వినియోగించుకుని బస్సు సేవలను పొందాలని పిలుపు ఇచ్చారు.
TSRTC: గ్రామీణ, పట్టణ ప్రయాణికుల కోసం టీఎస్ఆర్టీసీ మరో కొత్త రాయితీ పథకం
ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ 4,170 బస్సుల్లో ట్రాకింగ్ సదుపాయం ఉందన్నారు. హైదరాబాద్ లో పుష్పక్ ఎయిర్ పోర్ట్, మెట్రో ఎక్సప్రెస్ సర్వీస్ లకు ట్రాకింగ్ సౌకర్యం ఉందని తెలిపారు. జిల్లాల్లో పల్లె వెలుగు తప్ప అన్ని ఆర్టీసీ బస్సుల్లో జీపీఎస్ ట్రాకింగ్ సదుపాయాన్ని కల్పించారని వెల్లడించారు.