Hyderabad: నేడు హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో దారి మళ్లింపు

ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ శనివారం లగ్జరీ బస్సులను ప్రారంభించనుంది. పాత బస్సుల స్థానంలో వీటిని ప్రవేశపెడతారు.

Hyderabad: హైదరాబాద్ నగరంలో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ శనివారం లగ్జరీ బస్సులను ప్రారంభించనుంది. పాత బస్సుల స్థానంలో వీటిని ప్రవేశపెడతారు. కొత్త లగ్జరీ బస్సులు మరింత ఆధునికంగా, లేటెస్ట్ ఫీచర్లతో రానున్నాయి.

Chanda Kochhar: అక్రమ రుణ మంజూరు కేసులో ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్ దంపతుల అరెస్ట్

కొత్త బస్సుల్లో ట్రాకింగ్ సిస్టం, రిక్లైనింగ్ సీట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు, సెక్యూరిటీ కెమెరా, ఫైర్ డిటెక్షన్, అలారమ్ సిస్టమ్ వంటి ఫీచర్లున్నాయి. ఈ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం ట్యాంక్‌బండ్ వద్ద జరగనుంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొత్త బస్సులను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం దృష్ట్యా అధికారులు ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 12.00 గంటల నుంచి సాయంత్రం 05.00 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. వాహనదారులు ఈ విషయాన్ని గుర్తించి, దీనికి అనుగుణంగా తమ ప్రయాణ రూట్లను మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ దారి మళ్లింపు, అనువైన, ప్రత్యామ్నాయ రూట్ల వివరాల్ని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

Group 4 Jobs: నిలిచిపోయిన గ్రూప్-4 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ.. అభ్యర్థుల్లో అయోమయం

రాణిగంజ్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనదారులు సెయిలింగ్ క్లబ్ వద్ద నుంచి కవాడిగూడ ఎక్స్ రోడ్స్, డీబీఆర్ మిల్స్ వైపు వెళ్లాలి. లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనదారులు అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఇక్బాల్ మినార్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాదారులు అంబేద్కర్ విగ్రహం వద్ద లిబర్టీ, హిమాయత్ నగర్ వైపు, అలాగే ముషీరాబాద్ జంక్షన్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనదారులు కవాడిగూడ ఎక్స్ రోడ్స్ వద్ద లోయర్ ట్యాంక్ బండ్ వైపు, డీబీఆర్ మిల్స్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనదారులు డీబీఆర్ మిల్స్ వద్ద గోశాల-కవాడిగూడ-బైబిల్ హౌస్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.

అలాగే ఇక్బాల్ మినార్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనదారులు పాత సచివాలయం వద్ద తెలుగుతల్లి ఫ్లై ఓవర్, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.