PM Modi Hyderabad Tour : ప్రధాని మోదీ పర్యటనకు భారీ బందోబస్తు .. బేగంపేట-సికింద్రాబాద్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

ప్రధాని మోదీ సికింద్రాబాద్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోదీ పర్యటనలో వెయ్యిమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో బేగంపేట-సికింద్రాబాద్ మార్గంలో తో పాటు పరేడ్ గ్రౌండ్ ప్రాంతంలోనూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.

PM Modi Hyderabad Tour : ప్రధాని మోదీ సికింద్రాబాద్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోదీ పర్యటనలో వెయ్యిమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో బేగంపేట-సికింద్రాబాద్ మార్గంలో తో పాటు పరేడ్ గ్రౌండ్ ప్రాంతంలోనూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. సికింద్రాబాద్ తో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించాకు ప్రధాని మోడీ తెలంగాణ బీజేపీ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్పీజీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, పరేడ్ గ్రౌండ్ ను తమ అధీనంలోకి తీసుకంది.

ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ..
ప్రధాని మోదీ శనివారం (ఏప్రిల్ 8,2023) ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి బేగంపేట విమానశ్రయానికి వస్తారు. ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ సుమారు 20 నిమిషాల కార్యక్రమంలో ఆయన సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభిస్తారు. అనంతరం అందులో కొందరు విద్యార్థులు నల్గొండ వరకు ప్రయాణిస్తారు. అంతకముందు ప్రధాని వారితో ముచ్చటిస్తారు. తర్వాత 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్ మైదానానికి చేరుకుంటారు.

ఈ వేదికపై నుంచే పలు జాతీయ రహదారుల పనులకు బీబీ నగర్ ఎయిమ్స్ నూతన భవన సముదాయానికి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పూర్తైన సికింద్రాబాద్-మహబూబ్ నగర్ రైల్వే డబ్లింగ్ రైలును జాతికి అంకితం చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా పలు రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. 12.50 గంటల నుంచి 1.20 గంటల వరకు సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

ప్రధాని అభివృద్ధి పనుల వివరాలు.‌..
శంకు స్థాపన చేసేవి..
మొత్తం 11 వేల కోట్ల అభివృద్ది కార్యక్రమాల ప్రారంభం
1365.95 కోట్లతో బీబీ నగర్ ఎయిమ్స్ 750 పడకల హాస్పటల్ కి శంకుస్థాపన
తెలంగాణలోని 410 కిలోమీటర్ల జాతీయ రహదారులు విస్తరణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
720 కోట్ల సికింద్రాబాద్ రైల్వే అభివృద్ది పనులకు శంకుస్థాపన
ప్రారంభించేవి..
సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు
1410 కోట్లతో పూర్తయిన సికింద్రాబాద్ మహబూబ్ నగర్ డబుల్ లైన్ , విద్యుదీకరణ ప్రాజెక్టును జాతికి అంకితం
సికింద్రాబాద్ – మేడ్చల్, ఫలక్ నామ – ఉందానగర్ రూట్లలో 13 ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభం
మొదటి దశలో 44 కిలోమీటర్ల మార్గం వరకు ఎంఎంటీఎస్, రెండవ దశలో 51 కిలోమీటర్లు అందుబాటులోకి రానున్నాయి.

 

 

ట్రెండింగ్ వార్తలు