Hyderabad Traffic restrictions
Hyderabad Traffic restrictions : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అప్పర్ ట్యాంక్ బండ్ లో నేడు ప్రభుత్వం బతుకమ్మ సంబురాలు నిర్వహించనుంది. దీంతో అప్పర్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు చుట్టూ మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ తెలిపారు.
♦ తెలుగు తల్లి జంక్షన్, కర్బలా మైదాన్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు.
♦ ఇక్బాల్ మీనార్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ – కట్ట మైసమ్మ – డీబీఆర్ – ఇందిరాపార్క్ – గాంధీనగర్ – ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా డైవర్ట్ అవుతుంది.
♦ వీవీ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే ట్రాఫిక్ ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ప్రసాద్స్ ఐమాక్స్, మింట్ కాపౌండ్ లేన్ వైపు వెళ్తుంది.
♦ నల్లగుట్ట జంక్షన్ నుంచి బుద్ధ భవన్ వైపు వాహనాలకు అనుమతి లేదు. నల్లగుట్ట ఎక్స్‌క్రాస్ రోడ్ల వద్ద రాణిగంజ్, నెక్లెస్ రోడ్డు వైపు డైవర్షన్ ఉంది.
♦ లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఇక్బాల్ మీనార్ నుంచి యూటర్న్ తీసుకొని తెలుగు తల్లి జంక్షన్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై డైవర్ట్ కావాలి.
♦ సికింద్రాబాద్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్ – గోశాల -ధోబీఘాట్ – స్విమ్మింగ్ పూల్ -బండమైసమ్మ – ఇందిరా పార్కు కట్టమైసమ్మ, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు డైవర్ట్ అవుతాయి.
♦ ముషిరాబాద్, కవాడిగూడ నుంచి చిల్డ్రన్స్ పార్క్ – అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ కు అనుమతి లేదు. డీబీఆర్ మిల్స్ వద్ద తహసీల్దార్ ఆఫీస్ – ధోబీఘాట్ – స్విమ్మింగ్ పూల్ – బండమైసమ్మ – ఇందిరా పార్కు కట్టమైసమ్మ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
#HYDTPinfo#TrafficAlert 🚦
In view of the “Bathukamma Carnival” on 27.09.2025 at Upper Tank Bund, traffic congestion is expected between 2 PM-11 PM around Upper Tank Bund & Necklace Road.
Traffic may be diverted/stopped at key locations based on the local situation. Plan… pic.twitter.com/TQS15ewdFI— Hyderabad Traffic Police (@HYDTP) September 26, 2025
పార్కింగ్ ఏర్పాట్లు..
అప్పర్ ట్యాంక్ బండ్ లో నిర్వహించే బతుకమ్మ సంబురాల సందర్భంగా.. అక్కడికి వచ్చే వారికోసం పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. స్నోవరల్డ్, ఎన్టీఆర్ స్టేడియం, మార్టీర్స్ మెమోరియల్ పార్కింగ్ ప్లేస్, రేస్ కోర్స్ రోడ్, బీఆర్కే భవన్ రోడ్డు, హెచ్ఎండీఏ పార్కింగ్, సంజీవయ్య పార్క్, లుంబినీ పార్క్ లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.