Traffic Restrictions
Traffic Restrictions On Tank Bund : హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలెర్ట్. ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్నారా..? అయితే అటువైపు వెళ్లకండి. నేటి నుంచి 2వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు ట్యాంక్ బండ్, దాని పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సం వేడుకలను ట్యాంక్ బండ్‌పై అరంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో శనివారం ఉదయం నుంచి ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. దీనికితోడు పరేడ్ గ్రౌండ్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి.
Also Read : ఆ జీవోను వెంటనే రద్దు చేయండి.. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ
వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసులు సూచించారు.
అప్పర్ ట్యాంక్ బండ్ పై శనివారం ఉదయం 6 గంటల నుంచి జూన్ 2 రాత్రి 12 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు.
నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపునకు వచ్చే వాహనాలను రాణిగంజ్ వైపునకు మళ్లింపు.
రాణిగంజ్ నుంచి నెక్లెస్ రోటరీ వైపునకు వచ్చే వాహనాలను మినిస్టర్ రోడ్ వైపునకు మళ్లిస్తారు.
వీవీ స్టాచ్యూ వైపు నుంచి నెక్లెస్ రోటరీ వైపునకు వచ్చే వాహనాలను నల్లగుట్ట వైపునకు పంపుతారు.
పాత సైఫాబాద్ పోలీస్టేషన్ వైపు నుంచి వచ్చేవాహనాలను రవీంద్రభారతి వైపునకు మళ్లిస్తారు.
లిబర్టీ, బషీరాబాగ్ వైపునుంచి వచ్చేవాహనాలను అంబేడ్కర్ విగ్రహం నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపునకు మళ్లిస్తారు.