Hyderabad Doctor Lost Life : 25 అడుగుల ఎత్తు నుంచి తుంగభద్ర నదిలోకి దూకిన హైదరాబాద్ లేడీ డాక్టర్.. ఆ తర్వాత ఎంత ఘోరం జరిగిందంటే.. బీకేర్ ఫుల్..

థ్రిల్లింగ్ ఉంటుందని అనుకుందో మరో కారణమో కానీ.. ఏకంగా 25 అడుగుల ఎత్తు నుంచి తుంగభద్ర నదిలోకి దూకింది.

Hyderabad Doctor Lost Life : విహార యాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. సరదా.. ఓ యువ లేడీ డాక్టర్ ప్రాణం తీసింది. నదిలో ఈత కొడదామని చేసిన ప్రయత్నం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తుంగభద్ర నదిలో ఈత కొట్టే క్రమంలో హైదరాబాద్ కు చెందిన మహిళా డాక్టర్ మృతి చెందింది. మృతురాలిని డాక్టర్ అనన్యగా గుర్తించారు. ఆమె వయసు 27 ఏళ్లు.

డాక్టర్ అనన్య మోహన్ రావ్ హైదరాబాద్ నాంపల్లిలో నివాసం ఉంటుంది. ఓ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తోంది. డాక్టర్ అనన్య తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి కర్నాటకలోని హంపీ టూర్ కి వెళ్లింది. ఈ నెల 18న రాత్రి సనపుర గ్రామంలోని గెస్ట్ హౌస్ లో వారంతా బస చేశారు. 19వ తేదీన మధ్యాహ్నం గెస్ట్ హౌస్ కు సమీపంలోనే ఉన్న తుంగభద్ర నది దగ్గరికి వెళ్లారు. అక్కడ నీళ్లు చూడగానే.. డాక్టర్ అనన్యకు సరదాగా ఈత కొట్టాలని అనిపించింది. అయితే, ఆ సరదానే ఆమె ప్రాణం తీస్తుందని అస్సలు ఊహించలేదు.

Also Read : ఇదేందయ్యా ఇది.. కుంభమేళా తొక్కిసలాటలో చనిపోయాడు, కట్ చేస్తే 13రోజుల తర్వాత సజీవంగా ఇంటికొచ్చాడు.. షాక్ లో కుటుంబసభ్యులు, బంధువులు..

థ్రిల్లింగ్ ఉంటుందని అనుకుందో మరో కారణమో కానీ.. ఏకంగా 25 అడుగుల ఎత్తులో బండ రాయిపై నుంచి డాక్టర్ అనన్య.. తుంగభద్ర నదిలోకి దూకింది. కాసేపు ఈత కొట్టింది. అయితే, చూస్తుండగా.. నీటి ప్రవాహానికి ఆమె కొట్టుకుపోయింది. దీంతో ఆమె స్నేహితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనన్యను కాపాడేందుకు వారు ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అనన్య అదృశ్యమైంది.

అనన్య ఫ్రెండ్స్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు గజ ఈతగాళ్లను, అగ్నిమాపక దళాన్ని రప్పించారు. వారు రాత్రి వరకు ప్రయత్నం చేసినా అనన్య జాడ మాత్రం కనిపించలేదు. చీకటి పడటంతో గాలింపు చర్యలను నిలిపివేయాల్సి వచ్చింది. గురువారం ఉదయం మరోసారి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అనన్య మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు.

అనన్య మృతితో కుటుంబసభ్యులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేద్దామని వెళ్లిన డాక్టర్ అనన్య ఇక లేదు అనే వార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, డాక్టర్ అనన్య.. 25 అడుగుల ఎత్తు నుంచి తుంగభద్ర నదిలోకి దూకుతుండగా ఆమె ఫ్రెండ్స్ దూరం నుంచి వీడియో తీశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నదిలో ఈత కొట్టాలని అనుకోవడంలో తప్పు లేదు. కానీ, అక్కడి పరిస్థితులపై అవగాహన ఉండాలి. ఎదురయ్యే ప్రమాదాలను అంచనా వేయగలిగాలి. సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ లోతు ఎంతుందో తెలుసుకోవాలి. నీటి ప్రవాహం గురించి అవగాహన ఉండాలి. అసలు ఆ ప్రాంతం ఈతకు అనుకూలమైనదో కాదో గుర్తించాలి. ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకున్నాకే ఈత కొట్టాలా వద్దా అనే నిర్ణయానికి రావాలి.

Also Read : ఎంత ఘోరం.. మెడపై పడిన 270 కిలోల బరువైన రాడ్.. అక్కడికక్కడే వెయిల్ లిఫ్టర్ మృతి.. వీడియో వైరల్

కానీ, డాక్టర్ అనన్య ఇలాంటి జాగ్రత్తలు ఏవీ తీసుకోలేదని తెలుస్తుంది. సరదాగా ఈత కొట్టేందుకు ఆమె చేసి ప్రయత్నం ప్రాణం తీసింది. నదిలో ఈత కొట్టే ప్రయత్నంలో ఎంతోమంది ప్రమాదాల బారిన పడి చనిపోయారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడం, లోతు ఎక్కువగా ఉండి మునిగిపోవడం, నీళ్లలో ఉండే బండరాళ్లు తగిలి ప్రాణాలు కోల్పోవడం.. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి.