Sangareddy
Sangareddy : సంక్రాంతి పండుగ పూట సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి సమీపంలోని చెట్ల పొదల్లో పిచ్చి చెట్లకు కాసిన విషపు కాయలు తిని ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పటాన్ చెరు పరిధిలోని నేతాజీ నగర్‌లో నెలకొంది.
Also Read : Vijay Sethupathi: బిచ్చగాడు కత్తి పడితే.. అదిరిపోయిన విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్.. టైటిల్ ఏంటంటే?
నేతాజీ నగర్‌లో నివాసముంటున్న బీహార్‌కు చెందిన వలస కార్మికుని పిల్లలు సత్యం (8), శివమ్ (4), శుభం (2) అస్వస్థతకు గురయ్యారు. ఇంటి సమీపంలోని పిచ్చి చెట్లకు కాసిన విషపు కాయలను తినడంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని పఠాన్ చెరులోని ఏరియా ఆసుపత్రి కి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అయితే, వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు.. ఖమ్మం జిల్లా వైరాలో పండుగ వేళ విషాద ఘటన చోటు చేసుకుంది. చిన్నారి ఆడుకుంటూ వెళ్లి సాంబార్ లో పడి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వేడివేడి సాంబార్ లో పడటంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.. దీంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతిచెందింది.