Training Aircraft Crashes : తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి రావెల్లి శివారులో కూలిన శిక్షణ విమానం .. ఇద్దరు మృతి

మెదక్ జిల్లా తూప్రాన్ దగ్గర సాంకేతిక లోపంతో శిక్షణ హెలికాప్టర్ కూలిపోయింది. తుఫ్రాన్ మున్సిపాలిటీ పరిధి రావెల్లి శివారులో హెలికాప్టర్ కూలింది.

Aircraft Crashes : మెదక్ జిల్లా తూప్రాన్ దగ్గర సాంకేతిక లోపంతో శిక్షణ విమానం కూలింది. తుఫ్రాన్ మున్సిపాలిటీ పరిధి రావెల్లి శివారులో ఈ విమానం కూలింది. దుండిగల్ ఎయిర్ పోర్టు కు చెందిన శిక్షణ విమానంగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో విమానం కూలిపోయింది. కిందపడిన శిక్షణ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానం కూలిపోయిన సమయంలో భారీ శబ్దం రావడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

Also Read : Michaung Cyclone : ఏపీకి మిచాంగ్ తుఫాన్ ముప్పు.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

అయితే, ఈ శిక్షణ విమానం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఇందులో ఒకరు పైలెట్, మరొకరు ట్రైనీ పైలెట్ గా గుర్తించారు. విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగడంతో వారు మంటల్లో సజీవదహనం అయ్యారు. ఇద్దరు పైలెట్ల మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. మృతదేహాలకు ఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను అంబులెన్స్ సహాయంతో ఎయిర్ ఫోర్స్ అధికారులు హైదరాబాద్ కు తరలించారు.

 

ట్రెండింగ్ వార్తలు