Revanth Reddy : రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ మేయర్,నేతలు

టీఆర్ఎస్ పార్టీకి చెందిన బడంగ్‌పేట మేయర్ పారిజాత మరికొందరు టీఆర్ఎస్ నేతలు ఈరోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Revanth Reddy : టీఆర్ఎస్ పార్టీకి చెందిన బడంగ్‌పేట మేయర్ పారిజాత మరికొందరు టీఆర్ఎస్ నేతలు ఈరోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు.  2018 వరకు వారు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆ తర్వాత వారు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తిరిగి ఇప్పుడు రేవంత్ నాయకత్వంలో సొంతగూటికి చేరారు.

టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరిన అనతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలతో  పాటు గ్యాస్ డీజిల్ ధరలు పెరిగిపోయాయని… సామాన్యుడు బతకటం భారంగా మారిందని అన్నారు.  అదే విధంగా రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అప్పులపాలయ్యిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.

అభివృధ్ధి కుంటుపడటమే కాక తెలంగాణ దివాలా తీసే దిశలో ఉందని ఆయన వివరించారు. ఈ అంశాల్ననిటిపైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తూ ప్రజలకు అండగా ఉండాలని రాహుల్ గాంధీ సూచించారని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా… రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మాకూ ఉందని… కాంగ్రెస్ పార్టీలో  చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్ధానం ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు.

Also Read : Bank Robbery : తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ.. 3కిలోల బంగారు ఆభరణాలు చోరీ, కాలి బూడిదైన రూ.7.5లక్షల నగదు

ట్రెండింగ్ వార్తలు