Bank Robbery : జులాయి సినిమా తరహాలోనే.. గ్యాస్ కట్టర్‌తో బ్యాంకులో భారీ చోరీ

నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. మూడు కిలోల బంగారు ఆభరణాలు, భారీగా నగదు దోచుకెళ్లారు దొంగలు.

Bank Robbery : జులాయి సినిమా తరహాలోనే.. గ్యాస్ కట్టర్‌తో బ్యాంకులో భారీ చోరీ

Bank Robbery

Bank Robbery : జులాయి సినిమాలో బ్యాంకు దోపిడీ సీన్ గుర్తుందా? గ్యాస్ కట్టర్ సాయంతో బ్యాంకుని దోచేస్తారు. అచ్చం అలానే.. ఓ బ్యాంకుకి కన్నమేశారు దొంగలు. సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. జులాయి సినిమా తరహాలో మంకీ మాస్కులు ధరించిన దొంగలు అర్ధరాత్రి దాటిన తర్వాత గ్యాస్ కట్టర్‌తో షట్టర్ కట్ చేసి బ్యాంక్‌లో చొరబడ్డారు. భారీగా బంగారం, డబ్బును దోచుకెళ్లారు.

నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఈ చోరీ జరిగింది. మూడు కిలోల బంగారు ఆభరణాలు, భారీగా నగదు దోచుకెళ్లారు దొంగలు. గ్యాస్ కట్టర్ తో బ్యాంకు షట్టర్ ఓపెన్ చేసిన దొంగలు.. లాకర్లను కూడా గ్యాస్ కట్టర్ తో కట్ చేసి తెరిచారు. ఈ క్రమంలో అగ్నిప్రమాదం చోటు చేసుకొని లాకర్ లోని ఏడున్నర లక్షల రూపాయల నగదు కాలి బూడిదైంది. కీలక ఫైల్స్ కూడా దగ్ధమయ్యాయి. అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్, పోలీసులు.. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చోరీ ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీస్ కమిషనర్ నాగరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గ్యాస్ కట్టర్ తో లాకర్ ఓపెన్ చేయడంతో రూ.7.50 లక్షల నగదు కాలి బూడిద అయిందన్నారు. కొన్ని ఆధారాలు దొరికాయని, వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బ్యాంకు చోరీ కేసు విచారణకు సంబంధించి ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావును ప్రత్యేక విచారణ అధికారిగా నియమించినట్లు నిజామాబాద్ సీపీ నాగరాజు తెలిపారు.

Sidhu Moose Wala: సిద్ధూ హంతకుడు అరెస్టు.. వయస్సు 19 ఏళ్లే!

బ్యాంకులో చోరీ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. ఏకంగా మూడు కిలోల బంగారు ఆభరణాలు, భారీగా నగదు చోరీ కావడం కలకలం రేపుతోంది. అంతేకాదు ఏడున్నర లక్షల రూపాయలు కాలి బూడిదైంది. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. దొంగలు చాలా తెలివిగా వ్యవహరించారు.

Dhoom-Style Robbery : సినీ ఫక్కీలో చోరీ-చేతనైతే పట్టుకోండని సవాల్

పోలీసులకు చిక్కకుండా, ఎలాంటి క్లూ లభించకుండా.. సీసీ కెమెరా ఫుటేజీకి సంబంధించిన హార్డ్ డిస్క్ ను కూడా తమతో తీసుకెళ్లిపోయారు. ఇది అంతర్ రాష్ట్ర ముఠా పనా? లేక తెలిసిన వారి పనా? అనే కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. శనివారం రాత్రి ఈ చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో చోరీ ఘటన వెలుగులోకి రాలేదు. సోమవారం బ్యాంకు సిబ్బంది బ్యాంకుకి వచ్చి చూడగా షాక్ తిన్నారు. చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. చోరీ జరిగినట్టు నిర్ధారించుకున్న బ్యాంకు సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చింది.