Jeevan Reddy Angry With BJP : బీజేపీ నేతలపై ఈడీ, సీబీఐ ఎందుకు తనిఖీలు చేయడం లేదు : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే బీజేపీ రాద్ధాంతం చేస్తోందన్నారు. బీజేపీ నేతలపై ఈడీ, సీబీఐ ఎందుకు తనిఖీలు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీలో చేరితే కేసులు కొట్టివేస్తున్నారని పేర్కొన్నారు. ఈడీ మోదీ జేబు సంస్థలా మారిందని విమర్శించారు.

Jeevan Reddy Angry With BJP (1)

Jeevan Reddy Angry With BJP : బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే బీజేపీ రాద్ధాంతం చేస్తోందన్నారు. బీజేపీ నేతలపై ఈడీ, సీబీఐ ఎందుకు తనిఖీలు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీలో చేరితే కేసులు కొట్టివేస్తున్నారని పేర్కొన్నారు. ఈడీ మోదీ జేబు సంస్థలా మారిందని విమర్శించారు.

మోదీ చేతిలో సీబీఐ, ఈడీ కీలుబొమ్మలా మారాయని వ్యాఖ్యానించారు. కవిత ఇంటిపై దాడి చేసి రౌడీయిజం చేస్తారా అని మండిపడ్డారు. ఆధారాల్లేకుండా కవితపై ఆరోపణలు చేస్తారా అని నిలదీశారు. కవిత జోలికి వస్తే తెలంగాణ కన్నెర్ర చేస్తుందని హెచ్చరించారు.

MLA Jeevan Reddy : బీజేపీ అంటే జేబు దొంగల పార్టీ : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

మరోవైపు ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా బీజేపీపై మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక కూడా బానిసత్వమా అని ఆవేదన వ్యక్తం చేశారు. కవితకు బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలు దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.