MLC kavita Meet CM KCR : లిక్కర్ స్కామ్‌లో సీబీఐ నోటీసులు ..కాసేపట్లో సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటిసులు జారీ చేసింది. దీంతో ప్రగతి భవన్ లో కవిత తన తండ్రి, సీఎం కేసీఆర్ తో భేటీ అవ్వనున్నారు. మరి సీఎం కేసీఆర్ కవితకు ఎటువంటి దిశానిర్ధేశం చేయనున్నారు? అనేదానిపై ఆసక్తి నెలకొంది.

MLC kavita Meet CM KCR : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు మోగిపోతోంది. కానీ దీనికి నాకు ఎటువంటి సంబంధంలేదని..కేవలం రాజకీయ కక్షతోనే ఇటువంటి బెదిరింపులకు బీజేపీ పాల్పడుతోంది అంటూ కవిత చెప్పుకొచ్చారు. కానీ ఇవి కేవలం ఆరోపణలు కాదంటూ బీజేపీ వాదిస్తోంది. ఏది ఏమైనా లిక్కర్ స్కామ్ చుట్టుకోవటంతో కవిత ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి కొండంత అండగా తన తండ్రి సీఎం కేసీఆర్ ఉండగా కూడా కవిత ఆందోళన చెందుతున్నారంటే మ్యాటర్ ఎలాంటిదో ఊహించుకోవచ్చు. కవితపై వచ్చే ఈ ఆరోపణలో ఇటు కేసీఆర్ గానీ..అటు అన్న కేటీఆర్ గానీ స్పందించలేదు. టీఆర్ఎస్ నేతలు కొంతమంది మాత్రం బీజేపీపై విరుచుకుపడతున్నారు.

ఈక్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటిసులు జారీ చేసింది. దీంతో ప్రగతి భవన్ లో కవిత తన తండ్రి సీఎం కేసీఆర్ తో భేటీ అవ్వనున్నారు. దీనిపై చర్చలు జరుపనున్నట్లుగా తెలుస్తోంది. మరి తండ్రి బిడ్డను ఈ స్కామ్ నుంచి (ఆరోపణలు)నుంచి ఎలా బయటపడేస్తారు? గులాబీ బాస్ స్టైల్లో ఎటువంటి వ్యూహాలు చేస్తారు? అనేదానిపై కేసీఆర్ కవిత భేటీపై ఆసక్తి నెలకొంది.

CBI Notices MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు

కాగా మొన్న లిక్కర్ స్కాం కేసులో 36 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో ఎనిమిది మంది తెలుగు వాళ్లు ఉన్నారు. ఇక అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చారు. ఇదే కేసుకు సంబంధించి నిన్న సిబిఐ కవితకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని అధికారులు CRPC 160 ప్రకారం ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

కాగా .. సీబీఐ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు.డిసెంబర్ 6న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు అవుతానని తెలిపారు. ఈక్రమంలో కవిత తండ్రితో భేటీ కావటం ఆసక్తిగా మారింది. ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. కాగా..ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ దూకుడు పెంచింది. ఈ క్రమంలో కేసీఆర్ తో కవిత భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఏయే అంశాలు చర్చించనున్నారు. కేసీఆర్ బిడ్డకు ఎటువంటి దిశా నిర్దేశం చేస్తారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.

MLC Kavitha Respond : సీబీఐ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత


										

ట్రెండింగ్ వార్తలు