CBI Notices MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటిసులు జారీ చేసింది. కేవలం వివరణ కోసమేనని స్పష్టం చేసింది. 160 సీఆర్పీసీ కింద వివరణ ఇవ్వాలని సీబీఐ నోటీస్ ఇచ్చింది. ఢిల్లీ లేదా హైదరాబాద్ లో ఎక్కడ హాజరు అయినా పర్వాలేదని నోటీసుల్లో పేర్కొంది.

CBI Notices MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు

MLC Kavitha

CBI Notices MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటిసులు జారీ చేసింది. కేవలం వివరణ కోసమేనని స్పష్టం చేసింది. 160 సీఆర్పీసీ కింద వివరణ ఇవ్వాలని సీబీఐ నోటీస్ ఇచ్చింది. ఢిల్లీ లేదా హైదరాబాద్ లో ఎక్కడ హాజరు అయినా పర్వాలేదని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కవిత పేరును చేర్చిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈనెల 6న హైదరాబాద్ లో సీబీఐ విచారణకు కవిత హాజరవ్వనున్నట్లు తెలుస్తోంది.  ఈ కేసులో అరెస్టు అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ పొందుపర్చింది. దీంతో కేసులో కవిత పాత్ర ఏంటనే అంశంపై విచారణ చేసేందుకు ఆమెకు నోటీసులు ఇచ్చింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్లు ఉన్నట్లు వెల్లడైంది. అమిత్ అరోరా రిమాండు రిపోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వారి పేర్లను పేర్కొంది. లిక్కర్స్ స్కాం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అమిత్ అరోరాని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సౌత్ గ్రూప్ నుంచి చెల్లించిన రూ.100 కోట్లకు కంట్రోలర్ గా శరత్ చంద్ర, కె.కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్… ఈడీ అదుపులో వ్యాపారవేత్త అమిత్ అరోరా

అమిత్ ఆరోరా ఫోన్ కాల్ డేటాలో కవిత ఫోన్ నెంబర్ ఉందని, ఆరోరాతో కవిత పలు సార్లు మాట్లాడారని అమిత్ ఆరోరా తన ఫోన్ నుంచి కవితకు 10 సార్లు కాల్ చేసినట్లు ఈడీ పేర్కొంది. నిన్న అమిత్ అరోరాను అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగానే రిపోర్టు దాఖలు చేయగా అందులో ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్లు ఉన్నట్లు తెలిసింది. లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ రూ.100 కోట్ల ముడుపులు చెల్లించిందని, ఆ గ్రూపును శరత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ వివరించింది.

ఆ గ్రూపు ద్వారా విజయ్ నాయర్ కు రూ.100 కోట్లు చేరాయని తెలిపింది. అంతేకాకుండా 36 మంది 170 మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని, సాక్ష్యాలు లేకుండా చేయడానికి కుట్ర పన్నారని పేర్కొంది.
ధ్వంసమైన ఫోన్లలో కవితకు సంబంధించిన రెండు నెంబర్లు ఉన్నాయని ఈడీ చెప్పింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో తమకు ఎలాంటి సంబంధమూ లేదని ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే.