బీజేపీలో చేరిన TRS ఎంపీ జితేందర్ రెడ్డి

టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో రారు.బుధవారం(మార్చి-27,2019) సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.జితేందర్ రెడ్డికి అమిత్ షా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బీజేపీలోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జితేందర్ రెడ్డి 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ పై మహబూబ్ నగర్ ఎంపీగా విజయం సాధించారు.ఈసారి కూడా తనకే టికెట్ వస్తుందని ఆశించారు.అయితే సీఎం కేసీఆర్ జితేందర్ రెడ్డికి టికెట్ నిరాకరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయలేదనే ఆరోపణలతో జితేందర్ రెడ్డికి కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు.దీంతో ఆయన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.