Kalvakuntla Kavitha: కేంద్ర ప్రభుత్వ పథకాలు, విధానాలు జాతీయ ఆహార భద్రత వ్యవస్థకు ముప్పు: ఎమ్మెల్సీ కవిత

సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని, ప్రతి ఒక్క రైతు పండించిన పంటలో న్యాయమైన వాటా అందుతుందని మేము బలంగా విశ్వసిస్తున్నామని కవిత అన్నారు

Kalvakuntla Kavitha: ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆమె..కేంద్ర ప్రభుత్వం వరి సేకరణ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని, ప్రతి ఒక్క రైతు పండించిన పంటలో న్యాయమైన వాటా అందుతుందని మేము బలంగా విశ్వసిస్తున్నామని కవిత అన్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టీఆర్ఎస్ పార్టీ సర్వసన్నద్ధంగా ఉన్నట్లు కవిత పేర్కొన్నారు. తెలంగాణ ధాన్యం కొనుగోలుపై కేంద్రం ప్రదర్శిస్తున్న పక్షపాత ధోరణిని నిరసిస్తూ ఏప్రిల్ 11న టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ ఎత్తున నిరసనలు చేపట్టనున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

Also read:AP Property Tax : ఏపీ ప్రజలకు మరో షాక్.. ఆస్తి పన్ను పెంపు

కేంద్ర ప్రభుత్వ పథకాలు, విధానాలు జాతీయ ఆహార భద్రత వ్యవస్థకు ముప్పుగా ఆమె అభివర్ణించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం టీఆర్‌ఎస్ పార్టీ పోరాడుతుందని కవిత తెలిపారు. బంగారు తెలంగాణను సుసంపన్నమైన, ఉత్పాదక భూమిగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కె దక్కుతుందని, ప్రతి రైతు ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. భారతదేశంలో రైతులను విస్మరించడం వల్ల కలిగే పరిణామాలు ఏమిటో బీజేపీ ప్రభుత్వానికి తెలియజేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

Also read:Rahul gandhi : మాయావతికి సీఎం పదవి ఇస్తామని ఆఫర్ చేశాం.. సీబీఐ, ఈడీ భయంతో…

ట్రెండింగ్ వార్తలు