Rahul gandhi : మాయావతికి సీఎం పదవి ఇస్తామని ఆఫర్ చేశాం.. సీబీఐ, ఈడీ భయంతో…

ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో ఘటనను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహల్ గాంధీ ప్రస్తావిస్తూ బీఎస్పీ అధినేత మాయవతి తీరును తప్పుబట్టారు. శనివారం ఢిల్లీలో ద దళిత్ ట్రూత్ అనే ...

Rahul gandhi : మాయావతికి సీఎం పదవి ఇస్తామని ఆఫర్ చేశాం.. సీబీఐ, ఈడీ భయంతో…

Rahul Gandhi

rahul gandhi : ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో ఘటనను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహల్ గాంధీ ప్రస్తావిస్తూ బీఎస్పీ అధినేత మాయవతి తీరును తప్పుబట్టారు. శనివారం ఢిల్లీలో ద దళిత్ ట్రూత్ అనే పుస్తకావిష్కరణలో రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని మాయావతిని కోరామని, సీఎం పదవిని కట్టబెట్టి మీ వెనుకాల మేముంటామని ఆఫర్ చేసినట్లు రాహుల్ తెలిపారు. మాయావతి నుంచి కనీసం స్పందన కూడా రాలేదని అన్నారు. దీనికి కారణంగా సీబీఐ, ఈడీ, పెగాసెస్ లే కారణమని, తద్వారా బీజేపీకి స్పష్టమైన మెజార్టీని ప్రజలు ఇచ్చేందుకు అవకాశం మాయావతి కల్పించారని రాహల్ అన్నారు.

Rahul Gandhi: ఆర్ఎస్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేస్తున్నాం: రాహుల్ గాంధీ

నేను కాన్షీరామ్ లాంటి వారిని గౌరవిస్తానని, ఉత్తర ప్రదేశ్ లో దళితుల గొంతులను మేల్కొల్పడానికి వారు రక్తం, చెమటను చిందించారని అన్నారు. ఆ దశలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని, కానీ నేడు మాయావతి పోరాడేందుకు ముందుకు రాకుండా, మేమిచ్చిన ఆపర్ పైకూడా కనీసం స్పందించలేదని రాహుల్ తెలిపారు. బీఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ చూపిన బాటలో పయనించడం ద్వారా దళితులు తమ హక్కులకోసం పోరాడాలని రాహుల్ సూచించారు. భారతదేశానికి రాజ్యాంగం ఆయుధమని, సంస్థలు లేకుండా దానికి అర్థం లేదన్నారు. కానీ రాజ్యాంగాన్ని ఎలా అమలు చేస్తారు? అన్ని సంస్థలు ఆర్ఎస్ఎస్ చేతుల్లో ఉన్నాయని రాహుల్ యద్దేవా చేశారు.

Rahul Gandhi: “ప్రధాని మోదీ దిన చర్య ఇదే” అంటూ రాహుల్ ట్వీట్

దేశ ఆర్థిక పరిస్థితిని ఎత్తిచూపిన రాహుల్ గాంధీ.. ఇది పోరాడాల్సిన సమయం అని పిలుపునిచ్చారు. తాను అధికారంలోనే పుట్టినా దానిపై ఆసక్తి లేదని, నేను దేశాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నానని అన్నారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో 403 స్థానాలకు గాను 273 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, 125 స్థానాల్లో ఎస్పీ గెలిచింది. అదేవిధంగా కాంగ్రెస్ 2, బీఎస్పీ ఒక్క స్థానానికి పరిమితమైంది. అయితే బీఎస్పీ 2017లో 19 సీట్లు గెలుచుకుంది.